మీ పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి హ్యాట్సాఫ్.. కృష్ణంరాజు!
తెలంగాణ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అద్భుత విజయం సాధించింది. టిఆర్ఎస్ పార్టీ విజయం పట్ల, కేసీఆర్ నాయకత్వం పట్ల సినీ సెలెబ్రిటీలు వరుసగా స్పందిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, టిఆర్ఎస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే నాని, మంచు మనోజ్, రామ్ , రాజ్ తరుణ్ లాంటి సెలెబ్రిటీలంతా కేసీఆర్, కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
సీనియర్ నటుడు కృష్ణంరాజు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. చారిత్రాత్మక విజయం సాధించినందుకు కేసీఆర్ గారికి శుభాకాంక్షలు. మీ ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు హ్యాట్సాఫ్ అని కృష్ణంరాజు అన్నారు. మీరు ఇంకా మరింత ఎత్తుకు ఎదగాలి అని కృష్ణంరాజు అన్నారు.

ఇలా పలువురు సినీసెలెబ్రిటీలు కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ తెలంగాణాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం మరోమారు అధికారంలోకి వచ్చింది అని మంచులక్ష్మీ తెలిపింది. మీ పాలనలో మరో ఐదేళ్లు తెలంగాణ ఎలా ఉండబోతోందో చూడాలని ఉందని అంటూ మంచులక్ష్మీ పేర్కొంది.


Click it and Unblock the Notifications











