ఎన్నికల సమరం.. చిరంజీవిని కూడా వదలని జీవిత, రాజశేఖర్!

Recommended Video

Senior Hero Rajasekhar And Naresh Meets Chiranjeevi | Filmibeat Telugu

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మా అసోసియేషన్ కు మార్చి 10న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సీనియర్ నటుడు నరేష్, శివాజీ రాజా అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలిచాడు. నరేష్ తరుపున ప్యానల్ సభ్యులుగా హీరో రాజశేఖర్, జీవిత దంపతులు బరిలో నిలిచారు. తాజాగా వీళ్లంతా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు.

 బరిలో ఆ ఇద్దరూ

బరిలో ఆ ఇద్దరూ

ఆ మధ్యన మా అసోసియేషన్ నిధుల విషయంలో నరేష్, శివాజీ రాజా మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఒకరినొకరు పరస్పర విమర్శలు చేసుకున్న తర్వాత చర్చలతో వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు వీరిద్దరే అధ్యక్ష ఎన్నికల బరిలో పోటీ పడుతుండడంతో ఆసక్తిగా మారింది. తమ మధ్య విభేదాలు లేవని, ఎన్నిక ఏకగ్రీవం కాకపోవడం వలనే తాను పోటీ చేస్తున్నానని నరేష్ అంటున్నారు. చిత్ర పరిశ్రమలో అందరి మద్దత్తు కూడగట్టే పనిలో నరేష్ ఉన్నారు.

మెగాస్టార్ నివాసానికి

మెగాస్టార్ నివాసానికి

నరేష్, రాజశేఖర్, జీవితతో పాటు వారి మద్దత్తుదారులంతా కలసి మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవిని కలసి తమకు మా అసోసియేషన్ ఎన్నికల్లో మద్దత్తు తెలపాలని రాజశేఖర్ దంపతులు, నరేష్ చిరంజీవిని కోరారు. చిరు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మా అసోసియేషన్ భవన నిర్మాణమే ప్రధాన అంశంగా శివాజీ, నరేష్ ప్రచారం చేస్తున్నారు.

సంపూర్ణ మద్దత్తు

సంపూర్ణ మద్దత్తు

మా అసోసియేషన్ నిర్మించే కార్యాలయానికి తన సంపూర్ణ మద్దత్తు ఉంటుందని చిరంజీవి నరేష్, రాజశేఖర్ దంపతులతో అన్నట్లు తెలుస్తోంది. మా అసోసియేషన్ ఎన్నికల్లో జీవిత, రాజశేఖర్ ప్రమేయం ఆసక్తిగా మారింది. రాజశేఖర్ ఇటీవల తన సినిమాల విషయంలో కూడా జోరు పెంచారు. గరుడవేగ చిత్రంతో చాలా కాలం తర్వాత తన సత్తా నిరూపించుకున్న రాజశేఖర్ ప్రస్తుతం కల్కి చిత్రంలో నటిస్తున్నాడు.

 తెరవెనుక మాత్రమే

తెరవెనుక మాత్రమే

ఇదిలా ఉండగా నరేష్, రాజశేఖర్, జీవిత ఆదివారం రోజు సూపర్ స్టార్ మహేష్ ని కలసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరుని కలిశారు. సాధారణంగా ఇలాంటి పెద్ద స్టార్లు మా అసోసియేషన్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనరు. తెరవెనుక మాత్రమే ఉండిపోతారు. మా అసోసియేషన్ కు కాబోయే కొత్త అధ్యక్షుడు ఎవరనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X