స్టార్డమ్ చూసి ఓర్వలేక బ్లూ ఫిలిం కేసులో ఇరికించిందతనే.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన హీరో
ఇండస్ట్రీలో ఎవరి జీవితం ఎప్పుడు మారుతుందో తెలీదు. ఓ దశలో చిన్న నటుడిగా రాణించేవారు స్టార్ యాక్టర్ అయిపోతాడు, స్టార్ యాక్టర్‌గా ఉన్నవారు కింద స్థాయికి పడిపోతారు. కాబట్టి సినీ సెలబ్రిటీలంతా చాలా వరకు ఆచితూచి అడుగులు వేస్తుంటారు. అయితే స్టార్ హీరోగా ఎగిదిగ ఓ కథానాయకుడు అనుకోని పరిస్థితుల వల్ల బ్లూ ఫిల్మ్ కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది. దీంతో ఆయన కెరీర్ బాగా నష్టపోయింది. కానీ వాటిని ఎదుర్కొని ఆ తర్వాత మళ్లీ నిలబడి సినిమాల్లో రాణిస్తున్నారు. అయితే ఈ కేసులో తాను ఎలా ఇరుక్కున్నారో తెలిపారాయన. ఆ వీడియో ప్రస్తుతం బయటకు వచ్చింది. పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
సీనియర్ నటుడు సుమన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు వరుస సక్సెస్‌లతో సక్సెస్ఫుల్ హీరోగా రాణించారు. దాదాపు నాలుగు దశబ్దాల నుంచి ఇండస్ట్రీలోనే రాణిస్తున్నారు. ఎలాంటి సహాయ సహకారాలూ లేకుండా స్వయంకృషితో ఎదిగారు. 1977లో నీచల్ కులం చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఆయన తన తొలి సినిమాలో పోలీసు అధికారి పాత్ర పోషించి ఆకట్టుకున్నారు.

ఆ తర్వాత కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. మొత్తంగా 10 భాషల్లో 600కుపైగా సినిమాల్లో నటించినారు. తెలుగులో వెంకటేశ్వరుడు, శివుడు, రాముడు వంటి దేవుళ్ల పాత్రలు కూడా పోషించి అభిమానుల మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత దేవుళ్ల పాత్రల్లో ఆయనే చాలా మందికి గుర్తొస్తారు.
అయితే ఓ దశలో ఆయన స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో సుమన్ జీవితాన్ని కొన్ని వివాదాలు గట్టిగా కుదిపేశాయి. బ్లూ ఫిల్మ్ కేసులోనూ ఆయన ఇరుక్కున్నారు. , గుండా చట్టం కింద కూడా ఆయనపై కేసు కూడా నమోదైంది. ఫలితంగా ఆయన కెరీర్‌పై గట్టి ప్రభావం పడింది. అయితే దీనిపై సుమన్ ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడారు. అసలు ఈ కేసులో ఎలా ఇరుక్కున్నారో తెలిపారు.

సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... "ముందు నేను టైమ్‌ను బాగా నమ్ముతాను. నమ్మకపోతే డిప్రెషన్లోకి వెళ్తాం. టైమ్ ఎక్కడికైనా తీసుకెళ్తుంది. అప్పట్లో నేను చెప్తా ఎవరూ పట్టించుకోలేద. ఈ రోజు అందరూ పాటిస్తున్నారు. నేనే ఉదాహరణ. భాష తెలియని, సినీ బ్యాక్‌గ్రౌండ్ లేనీ నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. అదే డెస్టినీ, టైమ్. ఏమీ సంబంధం లేకుండా మా ఫ్రెండ్స్ ఎవరో తప్పు చేస్తే నా పేరు అందులో ఇన్వాల్వ్ అయింది. వేరే వాళ్లు నన్ను ఇరిక్కించారంటూ పుకార్లు వచ్చాయి కానీ అందులో నిజం లేదని తెలిపారు.
"అదంతా టైమ్ డిసైడ్ చేసింది. నేను అలా అనుభవించాలని జాతకంలో ఉంది. అనుభవించాను. ఇలా జరిగాక జాతకాలను, టైమ్‌ను మరింత సీరియస్‌గా తీసుకున్నాను. నేను అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు. నా ఫ్రెండ్ ఒకరు చేసినట్లు తెలిసింది. మరి అందులో నిజమెంతో నాక్కూడా పక్కాగా తెలీదు. ఇది జరిగినప్పుడు నా కెరీర్ అయిపోయింది అన్నారు. ఎందుకంటే నాపైన భయంకరమైన, జైలులో నుంచి బయటకు రాలేని కేసులు పెట్టారు. కానీ మళ్లీ ఆ టైమే బయటకు తీసుకొచ్చింది" అని అన్నారు.


Click it and Unblock the Notifications











