లేటు వయసులో ఆ హీరోకు లిప్ కిస్.. తొలిసారి పెదవి విప్పిన ఆమని!
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోయిన్లు మాత్రమే తమదైన పాత్రలను చేసి ప్రేక్షకులను ఫిదా చేశారు. అదే సమయంలో ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుని హవాను చూపించారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ ఆమని ఒకరు. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో సినిమాలు చేస్తోన్న ఆమె.. ఇప్పుడు కూడా మంచి పాత్రలను పోషిస్తూ ముందుకు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఓ సినిమాలో లిప్ కిస్ పెట్టుకోవడం గురించి తాజాగా ఆమని స్పందించింది. అసలు ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చిందో తొలిసారి పెదవి విప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే...
తెలుగులో స్టార్ హీరోయిన్:ఆమని 'ఆడది' అనే సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా వచ్చారు. ఆ తర్వాత 'జంబ లకిడి పంబ' అనే సినిమాతో భారీ స్థాయిలో పేరు సంపాదించారు. అప్పటి నుంచి వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోయారామె. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లలోనే నటిస్తూ సత్తా చాటారు. సుదీర్ఘమైన కెరీర్‌లో జగపతిబాబు, శ్రీకాంత్, నరేష్ వంటి హీరోలతో ఎక్కువ చిత్రాలు చేశారు.

ఆ సినిమాల్లో సూపర్‌గానే:సుదీర్ఘమైన కెరీర్‌లో ఆమని ఎన్నో అత్యుత్తమ పాత్రలతో మెప్పించారు. మరీ ముఖ్యంగా 'శుభలగ్నం', 'మిస్టర్ పెళ్లాం', 'శుభ సంకల్పం' వంటి చిత్రాల్లో ఉత్తమ నటిగా అవార్డులను సైతం అందుకున్నారు. ఇక, ఆ మధ్య వచ్చిన 'ఆ నలుగురు' చిత్రానికి గానూ సపోర్టింగ్ ఆర్టిస్టుగా సెలెక్ట్ అయ్యారు. అంతేకాదు, ఎన్నో మంచి పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో బిజీ:'ఆ నలుగురు' సినిమా తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న నటి ఆమని.. 2012లో 'దేవస్థానం' అనే సినిమాతో మరోసారి ఎంటరయ్యారు. అప్పటి నుంచి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె.. మంచి మంచి పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. అలాగే, టీవీ షోలలో సైతం కనిపిస్తున్నారు. మొత్తంగా ఈ మధ్య కాలంలో ఆమని ఫుల్ బిజీగా మారిపోయారు.

ఆ సినిమాలో లిప్ కిస్‌తో:ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్న ఆమని 2014లో వచ్చిన 'చందమామ కథలు' అనే సినిమాలో క్రేజీ రోల్‌ను చేశారు. ఇందులో ఆమె సీనియర్ నరేష్‌కు జోడీగా కనిపించారు. ఒక సందర్భంలో వీళ్లిద్దరూ లిప్ కిస్ పెట్టుకుంటారు. దీంతో ఇది అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా తర్వాత కూడా దీనిపై బాగానే చర్చలు జరిగాయి.

లిప్ కిస్‌పై తొలిసారిగా:తాజాగా ఆమని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'చందమామ కథలు' మూవీలో లిప్ కిస్ గురించి ఆమె స్పందించారు. 'హీరోయిన్‌గా నటించినప్పుడు బోల్డ్ రోల్స్ చేశాను. ఇందులో భాగంగానే చందమామ కథలు చిత్రంలో లిప్ కిస్‌కు ఓకే చెప్పాను. ఇది నాకు తప్పు అనిపించలేదు. నటిగా రాణించాలంటే దేనికైనా సిద్ధంగానే ఉండాలి' అని చెప్పుకొచ్చారు.

ఆ హీరోయిన్ ఆదర్శం:ఆ తర్వాత ఆమని కొనసాగిస్తూ.. 'అన్నీ తెలిసే ఇండస్ట్రీకి వచ్చాను. ఆర్టిస్టుగా ఉన్నప్పుడు మనకు మనం హద్దులు పెట్టుకోకూడదు. అలా కొంత మందికి వర్కౌట్ అవుతుంది. నేను మాత్రం అలా కాదు. అయినా జయసుధ గారు డీ గ్లామర్ రోల్స్ చేయలేదు. అయినప్పటికీ ఆమె స్టార్ అయ్యారు. నేచురల్ పాత్రల విషయంలో నేను ఆమెనే ఆదర్శంగా తీసుకుంటా' అని వివరించారు.


Click it and Unblock the Notifications











