ప్రముఖ సీనియర్ నటి భర్త కన్నుమూత.. విషాదంలో దక్షిణాది పరిశ్రమ
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ హీరోయిన్ జయచిత్ర. దాదాపు నలభై ఏళ్ల పాటు సినీ రంగంలో యాక్టివ్‌గా ఉన్న ఈమె ఇంట్లో తాజాగా విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త గణేశ్ శుక్రవారం తమిళనాడులోని తిరుచ్చిలో మరణించారు.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతోన్న ఆయనకు గురువారం రాత్రి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతోన్న సమయంలో తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. గణేశ్ మృతదేహాన్ని చెన్నైలోని పోయిస్ గార్డెన్‌లో ఉన్న స్వగృహానికి తరలించారు. ఆయన అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. ఇక ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు జయచిత్ర కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు.

కాకినాడకు చెందిన జయచిత్ర తమిళ సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యారు. అక్కడ అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత శోభన్ బాబు నటించిన 'సోగ్గాడు' అనే చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అప్పటి స్టార్ హీరోలు అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దక్షిణాదిలోని అన్ని భాషల్లో ఏకకాలంలో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపిన ఈమె.. చెన్నైకు వ్యాపారవేత్త అయిన గణేష్‌ను 1983లో వివాహం చేసుకున్నారు. వీళ్లిద్దరికీ అమ్రేష్ గణేష్ అనే కొడుకు ఉన్నాడు. ఈయన యాక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు.
అప్పటి తరం హీరోలతో కాదు.. విక్టరీ వెంకటేష్ - మీనా జంటగా నటించిన చిత్రం 'అబ్బాయిగారు', అక్కినేని నాగార్జున నటించిన 'ఘరానా బుల్లోడు', నందమూరి బాలకృష్ణ 'సమరసింహారెడ్డి'తో పాటు జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నరసింహుడు' వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించారు. ఇదిలా ఉండగా, ఆ మధ్య తన కారు డ్రైవర్ చేతబడి చేశాడన్న ఆరోపణలతో జయచిత్ర దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. దీనిపై న్యాయపోరాటం చేసిన జయచిత్ర విజయం సాధించారు.


Click it and Unblock the Notifications











