వైఎస్సార్ బయో పిక్: షర్మిల పాత్రలో ఆ హీరోయిన్ ఖరారు!
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రని యాత్ర పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వైఎస్ఆర్ పాత్రని మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదుల చేసిన సంగతి తెలిసిందే. వి రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
వైఎస్ స్నేహితుడు కెవిపి రామచంద్ర రావు పాత్రలో రావు రమేష్ నటిస్తున్నారు. తాజగా ఈ చిత్రంలోకి మరో కీలక నటి చేరింది. వైఎస్ కుమార్తె షర్మిల పాత్ర కోసం సీనియర్హీరోయిన్ భూమికని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. కీలక నటీ నటులతో వైఎస్సార్ బయోపిక్ చిత్రం భారీగా మారుతోంది.

బాహుబలి2 చిత్రంతో గుర్తింపు పొందిన ఆశ్రితి వేముగంటి.. విజయమ్మ పాత్రలో నటించబోతోంది. ఇక జగన్ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం తేలాల్సివుంది. వైఎస్సార్ బయోపిక్ చిత్రంతో రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నాయి. అంతా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











