తల లేకుండా సౌందర్యను అలా చూడగానే షాక్.. ఆ రోజు బాక్సులో అలా కనిపించింది: సీనియర్ హీరోయిన్
తెలుగు చిత్ర పరిశ్రమలో మర్చిపోలేని చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. ఇక అందులో సౌందర్య పేరు కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఆమె తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ లో కూడా అందరి స్టార్ హీరోలతో నటించారు. ఇక ఆమె మరణించి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంకా ఆమె ఇండస్ట్రీలోనే ఉందేమో అన్నట్లుగా చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు.
ఇక రీసెంట్ గా సీనియర్ నటి ప్రేమ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సౌందర్య గురించి ఒక వివరణ ఇచ్చారు. అంతేకాకుండా ఆమె మరణించినప్పుడు చాలా బాధగా అనిపించింది అని అప్పటి చేదు జ్ఞాపకాలను ఆమె తెలియజేశారు ఆ వివరాల్లోకి వెళితే..

తక్కువ కాలంలోనే: హీరోయిన్ సౌందర్య.. ఈ పేరు విన్న ప్రతీ ఒక్క అభిమాని కళ్లల్లో ఆమె రూపం ఇప్పటికీ మెదులుతుంటుంది. అందం, అభినయం, అణుకువతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన నటించింది. 1992లో సినీ రంగంలో హీరోయిన్ గా అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
అందం, అభినయంతో: ఏ మాత్రం ఎక్స్ పోజింగ్ చేయకుండా పద్దతిగా కనిపిస్తూనే వరుస సినిమాల్లో ఛాన్సు దక్కించుకుంది. అందం, అభినయంతో ఎన్నో మంచి సినిమాల్లో కనిపించింది. ఇప్పటికీ ఆమెను ఎవరూ మర్చిపోలేకపోతున్నారంటేనే ఆమె టాలెంట్ ఏంటో తెలుస్తుంది. పన్నెండేళ్లలోనే దాదాపు 50కి పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె.. 27 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయింది.

ఆమె మరణం: ఓ రాజకీయ పార్టీ ప్రచారం కోసం హెలికాప్టర్ లో బయలుదేరిన సౌందర్య.. ప్రమాదానికి గురై చనిపోయింది. ఆ సమయంలో సౌందర్య గర్భవతి అని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఆమె పార్థివదేహాన్ని చూసేందుకు లక్షలాది మంది వెళ్లారు. అయితే ఆ సమయంలో సౌందర్య తల, మొండం వేరు అయ్యాయని అలనాటి హీరోయిన్ ప్రేమ చెప్పారు.
ఓ బాక్సులో తల లేకుండా..: సౌందర్య చనిపోయిందని తెలియగానే వాళ్ల ఇంటికి వెళ్లినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే బయట సౌందర్య, ఆమె అన్నయ్య ఫొటోలు పెట్టగా.. ఓ బాక్సులో తల లేని సౌందర్య మొండం పెట్టారని చెప్పారు. అది చూసిన తర్వాత తాను చాలా షాకైనట్లు వివరించారు. తల లేకపోయినా ఆమె వాచీ చూసే సౌందర్య మృతదేహాన్ని గుర్తించినట్లు తెలుసుకొని వెక్కి వెక్కి ఏడ్చినట్లు స్పష్టం చేసారు.

నమ్మడమే కష్టంగా ఉంది..: ఆ సమయంలో సౌందర్య తల్లితో మాట్లాడే ధైర్యం కూడా చేయలేక పోయాయని ప్రేమ అన్నారు. సౌందర్య అందమైన మొహం ఇప్పటికీ తనకు గుర్తు ఉందని.. స్టార్ హీరోయిన్ చనిపోయిందంటే నమ్మడమే కష్టంగా తోచిందన్నారు. ఎవరైనా సరే చనిపోయిన తర్వాత ఏమీ తీసుకెళ్లలేమని.. కేవలం పేరు మాత్రమే మన వెంట వస్తుందని ప్రేమ చెప్పుకొచ్చారు. తాను సౌందర్య చాలా మంచి స్నేహితులమని.. తరచుగా కలిసే వాళ్లమని బాధగా చెప్పారు.


Click it and Unblock the Notifications











