ఇక నుంచి అలాంటి పాత్రలే చేస్తాను.. నిజం మూవీలో బోల్డ్ పాత్రపై రాశి కామెంట్స్
టాలీవుడ్ ఇండస్ట్రీలో 90ల కాలంలో వచ్చిన హీరోయిన్స్ ఒక ట్రెండ్ సెట్ చేశారనే చెప్పాలి. ప్రస్తుతం ఎంతో మంది హీరోయిన్స్ వస్తున్నారు పోతున్నారు. కానీ ఓల్డ్ హీరోయిన్స్ అప్పట్లో యువతను గ్లామర్ తోనే కాకుండా ఎక్కువగా వారి నటనతో కూడా అమితంగా ఆకట్టుకునేవారు. ఇక హోమ్లీ పాత్రలతో కూడా మంచి క్రేజ్ అందుకున్న వారిలో రాశి ఒకరు. అయితే ఇటీవల ఆమె గతంలో చేసిన బోల్డ్ పాత్రలపై స్పందించారు. అలాగే తన దగ్గరకు వస్తున్న ఆఫర్స్ పై కూడా స్పందించారు.

దాదాపు 80కి పైగా సినిమాలు
దాదాపు 80కి పైగా సినిమాలు చేసిన రాశి ఎక్కువగా తెలుగులోనే సినిమాలు చేసింది. ఇక హీరోయిన్ కెరీర్ కి ఎండ్ కార్డ్ పెట్టినప్పటి నుంచి ఆమె చాలా వరకు వెండితెరకు దూరంగానే ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం అప్పుడప్పుడు కొన్ని డిఫరెంట్ పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

వయసు పెరుగుతున్నా..
రాశిని చాలా రోజుల తరువాత రెగ్యులర్ గా చూస్తున్న కొంతమంది అభిమానులు ఆశ్చర్యనికి లోనవుతున్నారు. ఎందుకంటే వయసు పెరుగుతున్నా కూడా ఆమె అందంలో పెద్దగా తేడా రాలేదు. పైగా ఇంకా ఆ అందం పెరిగిందనే కామెంట్స్ వస్తున్నాయి. జులై 29కి ఆమె 40లోకి అడుగు పెట్టారు. చూస్తుంటే నాలుగు పదుల వయసు దాటుతున్నా ఇంకా పాతికేళ్ల అమ్మాయిలనే ఉందనిపిస్తోంది.

యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా
ఇక లాక్ డౌన్ లో ఆమె రాశి విజన్ పేరుతో ఒక యూ ట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసి అందులో వంటలు చేస్తూ అలాగే తన పర్సనల్ విషయాలన గురించి కూడా షేర్ చేసుకుంటున్నారు. అలాగే వీడియోలు చూసిన ఫ్యాన్స్ నుంచి వచ్చే ప్రశ్నలకు ఆమె రెగ్యులర్ గా స్పందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఆమెకు వస్తున్న ఆఫర్స్ పై కూడా స్పందించారు.

ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేయను
నిజం సినిమాలో రాశి ఎలా కనిపించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే అలాంటి పాత్రలు చేయకుండా మంచి రోల్స్ చేయండి అని ఆడియెన్స్ అడిగిన ప్రశ్నలకు రాశి ఈ విధంగా ఆన్సర్ ఇచ్చింది. అవును నేను కూడా అలాంటి పాత్రలు చేయాలని అనుకోవడం లేదు. ఇక నుంచి ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేయాలని అనుకోవడం లేదని తెలిపింది.
Recommended Video
అలాంటి పాత్రలే వస్తున్నాయి
అదే విధంగా తను హీరోయిన్ గా ఉన్నప్పుడు ఎక్కువగా హోమ్లీ క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడేదాన్ని అంటూ ఇప్పుడు కూడా అలాంటి మంచి పాత్రలు కొత్తగా ఉంటే తప్పకుండా చేస్తానని అన్నారు. అయితే తన వద్దకు వస్తున్న వారు కూడా అలాంటి పాత్రలు కాకుండా నెగిటివ్ గా ఉండే బోల్డ్ పాత్రలతో వస్తున్నారు అంటూ.. ఇక నుంచి తన దగ్గరకు రావాలని అనుకునే వాళ్ళు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మంచి పాత్రలు ఉంటే చెప్పాలని వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











