Vijaya Shanthi: నందమూరి హీరో సినిమాలో రాములమ్మ... మరోసారి అలాంటి పాత్రలో..?

సీనియర్ హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 90స్ లో స్టార్ హీరోల సరసన యాక్ట్ చేయడమే కాకుండా... తను కూడా లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో స్టార్ట్ చేసిన ఈ హీరోయిన్... ఇప్పుడు మరో హీరో సినిమాలో నటించేందుకు సిద్ధం అయింది. అయితే ఈసారి కూడా మరోసారి తనకు గుర్తింపు తెచ్చిన పాత్రలోనే నటించబోతుంది రాములమ్మ. ఆ సినిమా ఏంటి... ఎలాంటి పాత్రలో నటించబోతుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి... మూడు దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. చిరంజీవి, కృష్ణ, బాలకృష్ణ, శోభాన్ బాబు వంటి హీరోలతో కలిసి నటించింది విజయ శాంతి. అంతే కాదు.. కర్తవ్యం లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆమె నటనకు మంచి గుర్తింపు అయితే వచ్చింది. అంతే కాదు... ఈ కర్తవ్యం సినిమాకు ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది.

Senior Heroine VijayaShanthi Play Key Role in Nandamuri Kalyan Ram 21 Movie

ఇక రాజకీయాల్లోకి వెళ్లిన విజయ శాంతి.. సినిమాలకు దూరం అయింది. చాలా కాలం తర్వాత అనిల్ రావిపూడి, మహేశ్ బాబు కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఇక ఈ సినిమాలో ఆమె రీ ఎంట్రీ పాత్ర పవర్ ఫుల్ గా లేదని ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందారు. కానీ ఆమె నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. అంతే కాదు సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాలో గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు అంటూ విజయ్ శాంచి చెప్పిన డైలాగులు ఇప్పటికీ గుర్తుంటాయి.

Senior Heroine VijayaShanthi Play Key Role in Nandamuri Kalyan Ram 21 Movie

మహేశ్ బాబు సినిమా తర్వాత విజయ శాంతి ఎలాంటి సినిమా ఒప్పుకోలేదు. సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది. కానీ తాజాగా ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విజయ శాంతి. దాదాపు మూడేళ్ల తర్వాత కొత్త సినిమాకు సైన్ చేసింది రాములమ్మ. శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభం అయింది.

Senior Heroine VijayaShanthi Play Key Role in Nandamuri Kalyan Ram 21 Movie

నందమూరి కల్యాణ్ రామ్.. ప్రస్తుతం డెవిల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉండగా మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు ఈ హీరో. ఈ సినిమా శుక్రవారం ఘనంగా హైదరాబాద్ లో ప్రారంభమైంది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇందులో హీరోయిన్ గా కల్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ నటిస్తుంది. ఇక ఇదే సినిమాలో విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు.

Senior Heroine VijayaShanthi Play Key Role in Nandamuri Kalyan Ram 21 Movie

ఇక ఈ సినిమా వేడుకలో పాల్గొన్న విజయ శాంతి... మహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మురళీ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక ఈ మూవీకి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని విజయ శాంతి తన ట్విట్టర్ వేదికగా ఫోటోలు షేర్ చేశారు. అంతే కాదు.. ప్రత్యేకమైన కొన్ని సినిమాలు, కొన్ని సంవత్సరాలకొక్కసారి నన్ను పని చేయమని అనిపించే అరుదైన సందర్బాలలో, ఆ పాత్ర మల్ల మరోసారి నాకు ఒక సామాజిక ప్రాయోజిత, ఉద్వేగభరిత పోలీసు ఆఫీసర్ కథనం కూడా ఐనప్పుడు... అంటూ రాసుకువచ్చారు. దీంతో ఈ సినిమాలో కూడా ఆమె తనకు గుర్తింపు తెచ్చిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించబోతుందని అర్థం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X