చిరంజీవి వల్లే బతికి బయటపడ్డా.. మెగాస్టార్ ఇచ్చిన ధైర్యం వల్లే.. సీనియర్ జర్నలిస్ట్ ఎమోషనల్..
మెగాస్టార్ చిరంజీవిని నమ్ముకున్న వారిని ఎన్నటికి వదులుకోరని మరోసారి నిరూపించారు. అలాగే కష్టం వచ్చిందని తెలిస్తే వెంటనే స్పందించే గుణం ఉన్నవారు. మెగాస్టార్ సేవా గుణం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక రీసెంట్ గా తీవ్ర అనారోగ్యంతో గత 4 నెలల నుండి చికిత్స పొందుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కు కూడా మెగాస్టార్ తనవైపు నుంచి అని విధాలుగా సహాయం అందించారు.
Recommended Video

ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పారు
సీనియర్ జర్నలిస్ట్ శ్రీ రామ్మోహన్ నాయుడు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి మెగాస్టార్ పరామర్శించిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పారు. రామ్మోహన్ నాయుడుకి స్వస్థత చేకూరేందుకు అన్ని రకాలుగా ఆదుకోని ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చేశారు.

చేసిన మేలు జన్మలో మరువలేనని..
చిరంజీవి తీసుకొన్న చొరవ, ఇచ్చిన ధైర్యంతో రామ్మోహన్ రావు ఆరోగ్యం కుదుటపడింది. అనంతరం మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి శనివారం (ఫిబ్రవరి 5వ తేదీన) రామ్మోహన్ నాయుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు. తనకు, తన కుటుంబానికి చేసిన మేలు జన్మలో మరువలేనని చెప్పారు.

ఇంటి నుంచి ఆసుపత్రిలో చేర్పించిన మెగాస్టార్
చిరంజీవి గారిని కలిసి ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపారు రామ్మోహన్ నాయుడు. గతంలో తాను ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పాల్గొన్నానని చెప్పిన రామ్మోహన్ గత నాలుగు నెలల నుండి నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. అయితే తన న అనారోగ్యం గురించి తెలుసుకున్న చిరంజీవి గారు వెంటనే నన్ను ఇంటి నుంచి ఆసుపత్రిలో చేర్పించారని చెప్పారు.

జన్మంతా రుణపడి ఉంటాను..
హాస్పిటల్ వైద్యలు, చిరంజీవి గారి వల్లనేను పూర్తిగా కొలుకున్నాను. చిరంజీవి గారు లేకుంటే నా పరిస్తితి ఏమై పోయేదో.. ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ కు నా జన్మంతా రుణపడి ఉంటానని తెలిపారు. అలాగే స్వామి నాయుడు, మెగా ఫ్యాన్స్ కు కూడా నా ధన్యవాదాలు చెప్పారు రామ్మోహన్ నాయుడు.


Click it and Unblock the Notifications











