twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    BA Raju: సీనియర్ జర్నలిస్టు కన్నుమూత.. గుండెపోటుతో మృతి..!

    |

    టాలీవుడ్‌లో సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ పీఆర్వో, నిర్మాత బీఏ రాజు ఇకలేరు. కొద్ది రోజలు క్రితం కరోనావైరస్ బారిన పడిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఆయన బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌లో చేరారు. చికిత్స పొందుతూ ఆకస్మికంగా మరణించారు అని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ శుక్రవారం రాత్రి షుగర్ లెవెల్స్‌లో హెచ్చు తగ్గులు రావడంతోపాటు గుండెపోటు రావడంతో ఆయన మరణించారు అని కుమారుడు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

    కుమారుడు శివకుమార్ ట్వీట్ చేస్తూ

    కుమారుడు శివకుమార్ ట్వీట్ చేస్తూ

    నా తండ్రి బీఏ రాజు ఆకస్మికంగా మరణించారని తెలియజేయడానికి చాలా బాధగా, విషాదంగా ఉంది. శుక్రవారం సాయంత్రం షుగర్ లెవెల్స్ హెచ్చు తగ్గులు కావడం, గుండెపోటు గురికావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన బతికినంత కాలం రాజుగానే ఉన్నారు. మా గుండెల్లో సూపర్‌హిట్‌గానే ఉంటారు అని ట్వీట్‌లో తెలిపారు.

    బీఏ రాజు వ్యక్తిగత జీవితం

    బీఏ రాజు వ్యక్తిగత జీవితం

    బీఏ రాజు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయన భార్య, సినీ దర్శకురాలు బీ జయ ఆగస్టు 30, 2018 తేదీన మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు శివకుమార్ దర్శకత్వం బాధ్యతలు ఇటీవలే చేపట్టారు. ఆయన రూపొందించిన చిత్రం విడుదల కావాల్సి ఉంది.

    సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా

    సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా

    సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా బీఏ రాజు విజయవాడలో తన కెరీర్‌ను ప్రారంభించారు. సీనియర్ జర్నలిస్టు మోహన్ కుమార్ వద్ద శిష్యరికం చేశారు. మోహన్ కుమార్ ప్రోత్సాహంతోనే ఆయన సినీ జర్నలిస్టుగా మారారు. దాదాపు 35 ఏళ్లుగా జర్నలిస్టుగా కొనసాగారు. సూపర్ హిట్ పత్రికను ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు. కృష్ణతోపాటు మహేష్ బాబు కూడా అభిమానిగా మారారు. సినీయర్ నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో మంచి అనుబంధం ఉంది. కృష్ణ కుటుంబంలోని హీరోల సినిమాలకు పీఆర్వోగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారారు.

     1000కిపైగా చిత్రాలకు పీఆర్వోగా

    1000కిపైగా చిత్రాలకు పీఆర్వోగా

    కృష్ణ అభిమానిగానే కాకుండా పీఆర్వోగా ఆయనకు ఆపారమైన అనుబంధం ఉంది. 1987 నుంచి ఇప్పటి వరకు దాదాపు 1000కిపైగా చిత్రాలకు పీఆర్వోగా వ్యవహరించారు. ప్రస్తుతం అఖండ, నారప్ప, సర్కారు వారీ పాట, పెళ్లి సందడి, సీటీమార్, శాకుంతలం సినిమాలకు పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు.

    Recommended Video

    #17YearsOfAarya : Allu Arjun ఎమోషనల్, లో బడ్జెట్ హెవీ ప్రాఫిట్స్ ! || Filmibeat Telugu
    ప్రేమలో పావణి కల్యాణ్‌తో నిర్మాతగా

    ప్రేమలో పావణి కల్యాణ్‌తో నిర్మాతగా

    రచయిత ఘటికాచలం దర్శకత్వంలో ప్రేమలో పావణి కల్యాణ్ చిత్రం ద్వారా నిర్మాతగా మారారు. అనంతరం నిర్మాతగా తన భార్య, జర్నలిస్టు బీ జయ దర్శకత్వంలో చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం చిత్రాలను నిర్మించారు.

    English summary
    Senior Journalist BA Raju died with coronavirus poisitive
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X