twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘‘ఎన్టీ రామారావు కొడుకుల వల్ల సుఖపడలేదు, కవర్లలో డబ్బు... బాలయ్య కొద్దిగా పర్వాలేదు’’

    |

    ఎన్టీఆర్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు విడుదలైన తర్వాత రామరావు జీవితంలో బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు ప్రజలకు తెలిశాయి. ఈ క్రమంలో ఎన్టీ రామారావుకు సన్నిహితంగా ఉండే వారు సైతం మీడియా ముందుకు వచ్చి అప్పట్లో జరిగిన పలు విషయాలనుపంచుకునే ప్రయత్నం చేశారు.

    ఎన్టీ రామరావు వద్ద చాలా కాలం పాటు డ్రైవర్‌గా పని చేయడంతో పాటు ఆయన చైతన్యరథం నడిపిన లక్ష్మణ్ తాజాగా ఓ ఛానల్‌తో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీ రామారావు తన కుమారుల గురించి చాలా బాధపడుతుండేవారని, తనతో కూడా ఆ విషయాలు చెప్పుకుని బాధపడేవారని తెలిపారు.

    ప్రయోజకుడు లేడు, బాలయ్య కొద్దిగా పర్వాలేదు

    ప్రయోజకుడు లేడు, బాలయ్య కొద్దిగా పర్వాలేదు

    ఎన్టీ రామారావు కుమారులు తినడమే తప్ప... పని చేసి పైకొద్దామనే ఆలోచన ఎవరికీ ఉండేది కాదు. ఈ విషయంలో పెద్దాయ మనసులో చాలా బాధపడేవారు. ‘ఏం లచ్చన్నా... ఎవ్వడూ ప్రయోజకుడు లేడు, నా పేరు నిలిపేవాడు లేడు. ఏదో బాలయ్య కొద్దిగా ఉన్నాడు, కానీ పూర్తి నమ్మకం లేదు.' అని చెబుతూ ఒకసారి బాధ పడ్డారని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు.

    ఫ్యాక్టరీ పెట్టిస్తానని చెప్పారు

    ఫ్యాక్టరీ పెట్టిస్తానని చెప్పారు

    మొదటి సారి సీఎం అయినపుడు జయశంకర్ బాబుకు కూర్చో పెట్టి చాలా చెప్పాడు. ‘‘నువ్వు బయట తిరిగు... ఏ ఫ్యాక్టరీ పెడితే బావుంటుందనే విషయం కనుక్కో, నేను నీకు ఫ్యాక్టరీ పెట్టిస్తాను, ఐదు, పది వేల మందికి భోజనం పెట్టినవారం అవుతాం. థియేటర్ చూసుకోవడం ఏమిటి? దాన్ని చూసుకోవడం కూడా మీకు చేతకాదు... దానికి ఇంకా ఓ మేనేజర్‌ను పెట్టుకుంటారు.'' అంటూ జయశంకర్ బాబుకు పెద్దాయన చెప్పినట్లు లక్ష్మీణ్ వెల్లడించారు.

    కొడుకులతో ఎన్టీ రామారావు సుఖపడలేదు

    కొడుకులతో ఎన్టీ రామారావు సుఖపడలేదు

    ‘‘కొడుకులతో ఎన్టీ రామారావు సుఖపడలేదు. ఆయన్ను చివరి వరకు కష్టపెట్టారు. కూతురు పురంధరేశ్వరి రోడ్ నెం.13 దగ్గర్లనే ఉండేవారు. అప్పుడప్పుడూ క్యారేజ్ పట్టుకుని వచ్చేవారు. కొడుకులంతా కేవలం డబ్బు కోసమే వచ్చేవారు.'' అని లక్ష్మణ్ తెలిపారు.

    కవర్లలో డబ్బులు తీసుకెళ్లి ఇచ్చేవారం

    కవర్లలో డబ్బులు తీసుకెళ్లి ఇచ్చేవారం

    ‘వారికి డబ్బు అవసరం అయినపుడు వచ్చి పెద్దాయన ముందు రెండు చేతులు కట్టుకుని నిలబడేవారు. డబ్బు అవసరం లేనంత వరకు తండ్రిని చూసేందుకు కూడా వచ్చేవారు కాదు. ప్రతి నెల సార్ డబ్బులు కవర్లలో పెట్టి ఇస్తే... నేను, మోహన్ వెళ్లి స్వయంగా అందరికీ ఇచ్చి వచ్చేవారం.' అని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.

    English summary
    Senior NTR Driver Lakshman revealed about NTR Sons and Daughters behavior. Nandamuri Taraka Rama Rao, popularly known as NTR, was an Indian actor, producer, director, editor and politician who served as Chief Minister of Andhra Pradesh for seven years over three terms. He is widely regarded as one of the best actors of Indian cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X