Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అలనాటి ప్రముఖ గాయకుడు వి.రామకృష్ణ మృతి
హైదరాబాద్: ఆనాటి ప్రముఖ గాయకుడు విస్సంరాజు రామకృష్ణ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ రోజు జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
రామకృష్ణ....విస్సంరాజు రంగశాయి, రత్నం దంపతులకు 1947 ఆగస్టు 20 రామకృష్ణ విజయనగరంలో జన్మించారు. గానకోకిల సుశీల రామకృష్ణకు పినతల్లి. నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు.
ఆయన కెరీర్ విషయానికి వస్తే...
ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్‌బాబు, కృష్ణంరాజు నటించిన చిత్రాల్లో గాత్రమందించారు. ముఖ్యంగా....భక్తి గీతాల ఆలాపనలో తనదైన ముద్ర వేసుకున్నారు. మహాకవి క్షేత్రయ్య, దానవీరశూరకర్ణ, అమరదీపం, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, శ్రీషిర్డీసాయిబాబా మహత్యం, బలిపీఠం, గుణవంతుడు, అందాలరాముడు, తాతా మనవడు, భక్తతుకారం, శారద, భక్తకన్నప్ప, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, కరుణామయుడు వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన పాటలు పాడారు. తన సుమధుర గాత్రంతో ప్రేక్షకుల మదిలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు.
అమరగాయకుడు ఘంటసాల స్ఫూర్తితో సినీ రంగ ప్రవేశం చేసిన రామకృష్ణ 200 చిత్రాల్లో దాదాపు 5వేలకు పైగా గీతాలను ఆలపించారు. ఆయన ఆలపించిన భక్తి గీతాల ఆల్బమ్స్ విశేష ఆదరణ పొందాయి.
రామకృష్ణ తనయుడు తనయుడు సాయి కిరణ్ ఉషాకిరణ్‌మూవీస్ 'నువ్వే కావాలి' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. రామృకృష్ణ మృతిపట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని పలువురు సినీ ప్రముఖులు కొనియాడారు. వన్ ఇండియా తెలుగు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తోంది.
ఆయన పాడిన పాటలు కొన్ని ఇక్కడ వీక్షించండి...