దానిపైనే చిరంజీవి సినిమా ఆధారపడి ఉంటుంది.. ఎన్టీఆర్, విజయ్ దేవరకొండతో భారీ ప్లాన్!
Recommended Video

నిర్మాత అశ్విని దత్ అంటే భారీ చిత్రాలే గుర్తుకు వస్తాయి. చిరంజీవి, నాగార్జున, వెంకీ వంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి ఘనవిజయాలు అందుకున్నారు. శక్తి చిత్రం తరువాత కొంత గ్యాప్తీసుకున్న అశ్విని దత్ ఇటీవల వచ్చిన మహా నటి చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు మళ్ళీ బిజీ నిర్మాతగా అశ్విని దత్ మారుతున్నారు. ఆయన భవిష్యత్తు ప్రణాళిక చూస్తే ఎంత భారీ చిత్రాలు నిర్మించబోతున్నారో అర్థం అవుతుంది.

మెగాస్టార్‌తో సినిమా
ఓ ఇంటర్వ్యూలో అశ్విని దత్ మాట్లాడుతూ.. మహానటి చిత్రం తరువాత నాగ అశ్విన్ చిరంజీవి కోసం ఓ స్టోరీ లైన్ సిద్ధం చేశాడు. చిరంజీవి కథ సరిపోతుందని అనిపించింది. పూర్తి కథ సిద్ధం అయిన తరువాత చిరంజీవితో చేస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని మరో మరు పరిశీలిస్తాం అని అశ్విని దత్ అన్నారు. నాగ అశ్విన్ రెడీ చేసే కథపైనే మెగాస్టార్ చిత్రం ఆధారపడి ఉంటుంది.

ఇక నా కుమార్తెలు చూసుకుంటారు
నలభై ఏళ్లుగా సినిమాలు నిర్మిస్తూవస్తున్నానని అశ్విని దత్ అన్నారు. ఎదో ఒక రోజు తప్పకుండా సినిమాల నుంచి రిటైర్ అవుతానని అన్నారు. నా కుమార్తెలు స్వప్న, ప్రియాంక మంచి విజయాలు సాధిస్తున్నారు. ఇకపై వారే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు నిర్మిస్తారని అశ్విని దత్ తెలిపారు.

అట్లీ తెలుగు సినిమా
తమిళ యువ సంచలన దర్శకుడు అట్లీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. కథా బలంతో సినిమాలు తెరకెక్కిస్తూ తిరుగులేని దర్శకుడిగా అట్లీ దూసుకుపోతున్నాడు. చాలా కాలంగా అట్లీ నేరుగా తెలుగులో ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తాడనే ప్రచారం జరుగుతోంది. అది నిజమని అశ్విని దత్ మాటలతో తేలిపోయింది. తమిళ దర్శకుడు అట్లీతో త్వరలో ఓ చిత్రాన్ని నిర్మిస్తానని అశ్విని దత్ అన్నారు.

ఎన్టీఆర్, విజయ్ దేవరకొండతో భారీ ప్లాన్
భవిష్యత్తు చిత్రాల గురించి చెబుతూ ఎన్టీఆర్ తో ఓ సినిమాకి ప్లాన్ చేస్తున్నట్లు అశ్విని దత్ తెలిపారు. విజయ్ దేవర కొండతో రెండు చిత్రాల నిర్మిస్తానని అన్నారు. ప్రస్తుతం అశ్విని దత్ సూపర్ స్టార్ మాహేష్ నటిస్తున్న మహర్షి చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











