Jani Master Case: బాధితురాలిని రెచ్చగొట్టింది వాళ్లే.. జానీ మాస్టర్ వివాదంపై నిర్మాత సంచలనం

Jani Master Case: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. జానీ మాస్టర్ తనని లైంగిక వేధించాడని, పలుమార్లు తనపై అత్యాచారం చేశారని లేడీ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పై ప్రముఖులు కొందరు స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతున్నారని డిమాండ్ చేస్తుంటే..మరికొందరూ మాత్రం జానీ మాస్టర్ కు సపోర్టుగా నిలుస్తున్నారు. ఈ కేసులో ఏదో కుట్ర జరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు స్పందించారు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు ఓ ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ వ్యవహారంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. జానీ మాస్టర్ వివాదంలో ఏదో కుట్ర జరుగుతోందనీ, ఆ అమ్మాయి వెనకాల ఎవరో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో పెద్దల హస్తముంది కాబట్టే.. ఏలాంటి ఆధారాలు లేకుండా.. కేవలం ఓ అమ్మాయి ఆరోపించిందనీ, సెక్షన్ 376 కింద కేసు పెట్టడమేంటీ? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారం వెనకాల పెద్ద ఒత్తిడి, హై లెవల్ లో డ్రామా జరుగుతోందని అన్నారు. లేకపోతే.. 2019లో అమ్మాయిపై రేప్ జరిగితే.. 2024 లో కేసు పెట్టడమేంటీ? కచ్చితంగా రాజకీయ పెద్దల హస్తముందని అన్నారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు.

Senior producer Chittibabu responded to the case of choreographer Johnny Master

ప్రొడ్యూసర్ చిట్టిబాబు ఇంకా మాట్లాడుతూ.. '2019లో రేప్ జరిగితే.. 2024 వరకు జానీ మాస్టర్ తో ఎలా ట్రావెల్ చేసింది ? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు ఆ అమ్మాయి మాస్టర్ తో ట్రావెల్ చేసి, తనతో సినిమాలు చేసి, అతడ్ని పెళ్లి చేసుకుంటాననీ చెప్పి ఇన్నాళ్లు అతడితో పని చేసింది. ఇన్నాళ్లు అతడి నుండి బెన్ఫిట్స్ పొంది.. ఇన్నాళ్లు అతడి నుంచి ఏదో ఆశించింది. కానీ, ఇప్పడు జానీ మాస్టర్ నుంచి ఆ అమ్మాయి అనుకున్నది ఏదో పొందక పోవడంతో నేడు ఇలాంటి ఆరోపణలు చేస్తుందనే అనుమానం కలుగుతోంది' అని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రొడ్యూసర్ చిట్టిబాబు ఇంకా కంటిన్యూ చేస్తూ.. 'అయినా ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడమేంటీ? ఒక అమ్మాయి నోటి మాటతో చెబితే.. అరెస్ట్ చేస్తారు? ఇది వెనకాల ఎవరో ఉన్నారు? దీని వెనకాల రాజకీయ పెద్దల హస్తముందనే అనుమానం వస్తుంది. జానీ మాస్టర్.. త్రివిక్రమ్ ఇలా.. పవన్ కళ్యాణ్ మనుషులు, స్నేహితులపై ఇలాంటి ఆరోపణలు చేసి.. ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ను అబాసుల పాలు చేయడం కోసమే' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Senior producer Chittibabu responded to the case of choreographer Johnny Master

'ఆడపిల్లలకే కాదు.. మగవారికి కూడా బాధలుంటాయి. కానీ వారు చెప్పలేరు. ఆడపిల్ల చెప్పితే వేదం, మగపిల్లాడు చెప్పితే అది ఘోరమా..? ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుందని అనిపిస్తుంది. ఒక్క వ్యక్తి రేప్ చేస్తే.. ఇన్నాడు ఎలా ట్రావెల్ చేస్తారు? అమ్మాయి చెప్పినదానిలో ఓ పొంతనలేదు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా మాట్లాడాలి.. నిజాయితీగా వ్యవహరించండి. మగవాళ్లందరూ దుశ్శాసనుడు, దుర్యోధనుడు, రావణాసురుడు కాదు.. అలాగే.. ఆడవాళ్లు అనగానే.. సతి అనసూయలు, సతి సావిత్రిలూ కాదు. బ్లాక్ మెయిల్ చేసేవారు మగవాళ్లలో ఉన్నారు. ఆడవాళ్లలో ఉన్నారు.' అని ప్రొడ్యూసర్ చిట్టిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

More from Filmibeat

Read more about: jani master case chittibabu pocso
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X