బాపు 'సంపూర్ణరామాయణం' నిర్మాత ఎన్.ఎస్.మూర్తి మృతి
సీనియర్ నిర్మాత ఎన్.ఎస్.మూర్తి శుక్రవారం మధ్యాహ్నం చెన్నయ్‌లో మరణించారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. సంపూర్ణ రామాయణం, బుద్ధిమంతుడు, బాలరాజుకథ, అందాలరాముడు, భలేరంగడు, వారసత్వం వంటి చిత్రాలను...లక్కి ఎంటర్‌ప్రైజస్, చిత్ర కల్పన బేనర్లపై మూర్తి నిర్మించారు. ఆయనకు కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.ఎన్.ఎస్.మూర్తి...ఆంధ్రప్రదేశ్ లో తొలి స్టూడియోని నెలకొల్పిన సూరయ్య కుమారుడు. మూర్తి గారి మృతికి ధట్స్ తెలుగు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తోంది.
ఎన్.ఎస్.మూర్తి మృతికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తరఫున అధ్యక్షుడు ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వాణిజ్య మండలి తరఫున అధ్యక్ష, కార్యదర్శులు- బాలకృష్ణారావు, కె.సి.శేఖర్ బాబు ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపం తెలిపారు.
(ఈ మృతి విషయం కాస్త లేటుగా మీడియా దృష్టికి వచ్చింది)
ఎన్ ఎస్ మూర్తి రమణ బాపు లక్కీ ఎంటర్ ప్రైజస్ చిత్ర కల్పన సంపూర్ణ రామాయణం బుద్ధిమంతుడు బాలరాజుకథ అందాలరాముడు భలేరంగడు వారసత్వ ns murhty sampurna ramayanam chennai chitrakalpana


Click it and Unblock the Notifications