ఎవరికీ భయపడను, తప్పు చేస్తే ఆత్మహత్యే: వైసీపీలో చేరిన మోహన్ బాబు!
Recommended Video

ప్రముఖ తెలుగు నటుడు, మాజీ ఎంపీ, శ్రీ విద్యానికేతన్ సంస్థల అధినేత మోహన్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన మంగళవారం జాయిన్ అయ్యారు.
సినిమా రంగంలో ఉన్నప్పటి నుంచే ఎన్టీ రామారావుకు అత్యంత సన్నిహితుడైన మోహన్ బాబు... ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. గతంలో టీడీపీ ఎంపీగా కూడా పని చేశారు. తర్వాత టీడీపీ పగ్గాలు చంద్రబాబు చేపట్టడంతో మోహన్ బాబు క్రమక్రమంగా పార్టీకి దూరం అవుతూ వచ్చారు.

ఎవరినీ అడగాల్సిన అసవరం లేదు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ... వైసీపీలో చేరడానికి ఎవరినీ అడగాల్సిన అవసరం లేదని, ఇది ప్రజాస్వామ్యం, నా ఇష్టమొచ్చిన పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితమే జగన్ పార్టీలో చేరాలని అడిగారని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.

పదువులపై మోజు లేదు
పదవులు ఆశించి రాలేదని ఈ సందర్భంగా మోహన్ బాబు స్పష్టం చేశారు. 17 సంవత్సరాల క్రితమే రాజ్యసభకు వెళ్లొచ్చాను. బిజేపీకి సపోర్ట్ చేసి 18 శాతం వచ్చిన రోజునే నాకు ఏ పదవి ఇస్తారని అడిగి ఉండొచ్చు. నేను పదవులు కావాలనుకుంటే ఇప్పటికే చాలా వచ్చేవని తెలిపారు.

రూ. 19 కోట్లు రావాలి
తన కాలేజీలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని, తమకు రూ. 19 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు.

ఎవరికీ భయపడను, తప్పు చేస్తే ఆత్మహత్యే
‘‘నేను నోరు విప్పితే చంద్రబాబు నవరంద్రాలు మూసుకుపోతాయన్నారు. ఎందుకు నోరు విప్పడం లేదు? ఎవరికి భయపడుతున్నారు?'' అనే ప్రశ్నకు మోహన్ బాబు స్పందిస్తూ.. నా ప్రాణం పోయే వరకు ఎవరికీ భయపడను. సమాజంలో చేయరాని పని చేసిన రోజున తలవంచుకోవాలి, ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి. చంద్రబాబుకు భయపడటం లేదు. చంద్రబాబుకు నవరంద్రాలు అనే పదాన్ని నేను ఉపయోగించలేదు. దయచేసి ఆ లెటర్ సరిగా చదవండని మోహన్ బాబు తెలిపారు.


Click it and Unblock the Notifications











