Jani Master Case: 'దోషులు పెద్ద వారైనా శిక్షించాల్సిందే': మాజీ మంత్రి ఆర్కే రోజా

Jani Master Case: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. జానీ మాస్టర్ తనని లైంగిక వేధించాడని, పలుమార్లు తనపై అత్యాచారం చేశారని లేడీ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పై జానీ మాస్టర్ ను పోలీసులు అందులోకి తీసుకుని రిమాండ్ కు తరిలించారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతున్నారని డిమాండ్ చేస్తుంటే..మరికొందరూ మాత్రం జానీ మాస్టర్ కు సపోర్టుగా నిలుస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, నటి రోజాస్పందించారు. ప్రస్తుతం నటి రోజా చేసిన షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జానీ మాస్టర్ వివాదంపై మాజీ మంత్రి, నటి రోజా మాట్లాడుతూ..' ఇలాంటి చర్యలు క్షమించరానివి. జానీ మాస్టర్ అయినా.. ఎంత పెద్ద హీరో అయినా.. బడా డైరెక్టర్స్ అయినా.. పెద్ద ప్రొడ్యూసర్స్ అయినా సరే వాళ్లకు ఒక పనిష్మెంట్ ఇస్తేనే భవిష్యత్తులో ఆడపిల్లల జోలికి రారు. ఎవరైనా ఒక అమ్మాయిని ఎక్స్ ఫైట్ చేసి అమ్మాయిని వాడుకోవడం దారుణం. అవకాశాలు ఇస్తానని లేదంటే బెదిరింపులకు గురి చేయడం సరి కాదు. ఎవరూ చేసిన అది తప్పే.. ఏ ప్రొఫెషనల్ చేసిన తప్పే..' అని ఘాటుగా స్పందించారు. 'జానీ మాస్టర్ ఒక్కరే కాదు.. గతంలో చాలామంది తమను వేధింపులకు గురించి చేస్తున్నారని కంప్లైంట్ చేశారు. కానీ, ఆ సమయంలో వాటిని అంతగా పట్టించుకోలేదు. ఈ కేసును హైప్ చేయడంతో వారిప్పుడు మళ్ళీ ట్రీట్ చేస్తున్నారు. మేము కంప్లైంట్ చేసినప్పుడు ఎందుకు ఎవరు యాక్షన్ తీసుకోలేదు అని ప్రశ్నిస్తున్నారు.

Senior Telugu actress politician RK Roja Selvamani shocking comments on the case of choreographer Johnny Master

ఇండస్ట్రీలో ఇలాంటి దారుణాలు జరుగుతాయా? అని ప్రశ్నించగా.. 'జరుగుతున్నాయి కాబట్టే కాదా.. ఇలాంటి దారుణాలు బయటపడుతున్నాయి.నిజంగా ఆ దారుణాలను చెప్పడానికి చాలా కష్టపడుతుంది. రేపొద్దున సొసైటీలో మళ్ళి తిరగాలి. పదిమంది ఎలా చూస్తారు? ఎలా మాట్లాడుతారు? అనే భయం ఉంటుంది. కాబట్టి చాలామంది జరిగినా సైలెంట్ అయిపోవటం, సూసైడ్ చేసుకోవటం, ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడం, కొంత మంది వాటికి అలవాటేలే అనుకొని ముందుకు వెళ్లిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి విషయాలు కొన్నిబయటకు వస్తున్నాయి. జరగకపోతే ఎందుకు బయటకు వస్తాయి' అని అన్నారు.

'ఇలాంటి ఘటనపై చర్యలు తీసుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలి లేకపోతే భవిష్యత్తులో ఆడపిల్లలకు సేఫ్టీ ఉండదు. ముఖ్యంగా అమ్మాయిని మనం ఏదైనా లొంగపరుచుకున్న అడిగే వాళ్ళు వెనక లేరు. ఫ్యామిలీ సపోర్టు లేనివారిని, టార్గెట్ చేస్తుంటారు. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు రోడ్ మీద వచ్చి ధర్నాలు చేయడం చాలా మంది కంప్లైంట్ చేయడం. అందులో ఇలాంటి బ్యాక్ డ్రాప్ వారే ఎక్కువ మంది ఉన్నారు. సరే జానీ మాస్టర్ తప్పు చేశాడు అనగానే.. శిక్షించకుండా.. అతను తప్పు చేశాడా ? అనే విషయాన్ని ఎంక్వయిరీ చేయండి. ఎంక్వయిరీ చేసి తప్పు చేసి ఉంటే కచ్చితంగా శిక్షించండి. అది ఎంత పెద్ద వాళ్ళైనా కూడా పనిష్మెంట్ ఇవ్వాలి. ' అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

అనంతరం తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ మంత్రి, నటి రోజా స్పందించారు. ' చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ చూస్తే.. ఇంత దిగజారిపోయి.. పాలిటిక్స్ కోసం ఎంత పెద్ద అబద్ధాలైన చెప్పగలరా అనిపించింది. ఎందుకంటే అదే చిత్తూరు జిల్లాలో అయిన పుట్టాడు. మేము పుట్టాం.. వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు నమ్మకముంది. అలాంటిది ఆయన భక్తుల మనోవిప్రాయాలు ఏమవుతాయనే ఆలోచన లేకుండా.. ఆ వయసులో ఉన్న అలా ప్రకటన చేయడం సరికాదు. ఈరోజు ప్రతిదాన్ని రాజకీయ మూడేసి ప్రతి విషయంలో రాజకీయం చేయడం సరికాదు. తాను రాజకీయంగా సర్వైవ్ అవ్వటానికి, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎంత ఘోరంగా దిగజారుతారని అనుకోలేదు. గతంలో ఆయన ఒక్కసారి తిరుమలలోని ఓ మండపం కొట్టేసినప్పుడు దేవుడు ఆయకు తగిన బుద్ధి చెప్పాడు. అయినా.. మారలేదు. మళ్ళీ దేవుడి దగ్గరే పాలిటిక్స్ చేస్తున్నాడు. కాబట్టి అంతా ఆ దేవుడే చూసుకుంటాడు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X