సెన్సేషనల్ అర్జున్ రెడ్డికి ఏడాది.. సూపర్ పవర్‌స్టార్ పుట్టింది నేడే!
టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి చిత్రం ఏ రేంజ్‌లో సంచలనం సృష్టించిందో తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు ఓ సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండను, సందీప్ రెడ్డి వంగా లాంటి స్టార్ డైరెక్టర్‌ను అందించింది. అలాంటి సెన్సేషనల్ మూవీ విడుదలై ఆగస్టు 25వ తేదీతో ఏడాది పూర్తయింది.
అర్జున్ రెడ్డి చిత్రం కేవలం ప్రేక్షకాదరణే కాకుండా భారీ కలెక్షన్లను సాధించింది. యావత్ భారతం దృష్టిని ఆకర్షించింది. విజయ్ దేవరకొండ, శాలిని పాండే కెమిస్ట్రీ రంజింప చేసింది. సందీప్ రెడ్డి వంగా టేకింగ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది.

ప్రస్తుతం అర్జున్ రెడ్డి చిత్రం తమిళ, హిందీ వెర్షన్‌లో రూపొందుతున్నది. తమిళంలో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ ఎంట్రీ ఇస్తుండగా, హిందీలో షాహీద్ కపూర్ అర్జున్ రెడ్డి పాత్రను పోషిస్తున్నాడు. హిందీలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించడం విశేషం.
More from Filmibeat
arjun reddy sandeep reddy vanga shalini pandey vijay deverakonda vikram druv shahid kapoor అర్జున్ రెడ్డి సందీప్ రెడ్డి వంగ విజయ్ దేవరకొండ విక్రమ్ ధ్రువ్ షాహీద్ కపూర్


Click it and Unblock the Notifications











