కత్తి మహేష్ ఒక వీధి కుక్క.. దారుణంగా తిట్టిన శ్రీరెడ్డి.. ఫేస్‌బుక్‌లో ట్విస్ట్!
Recommended Video

ఇటీవల కాలంలో కొన్ని మీడియా సంస్థల్లో ప్రజలకు అవసరమైన విషయాల కంటే కత్తి మహేష్, శ్రీరెడ్డి ఎక్కువగా కనిపిస్తున్నారు. వారు చేసి అనవసరమైన వ్యాఖ్యలని పెద్దవిచేసి చూపిస్తూ టిఆర్పి రేటింగుల కోసం వాడుకుంటున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. వీరిని హైలైట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని వాదించేవారూ లేకపోలేదు. నిన్న మొన్నటివరకు శ్రీరెడ్డి వ్యవహారంతో పబ్బం గడుపుకున్న సదరు మీడియా సంస్థలు ప్రస్తుతం కత్తి మహేష్ ని ఉపయోగించుకుంటున్నారు. ఏకంగా శ్రీరామ చంద్రుడిపైనే దారుణమైన వ్యాఖ్యలు చేయిస్తూ డిబేట్లు పెట్టేస్తున్నారు. హిందూ సమాజం ఈ చర్యలపై భగ్గుమంటున్న తరుణంలో శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

ఫిల్మ్ క్రిటిక్ అని చెప్పుకుంటూ
ఫిల్మ్ క్రిటిక్ అని చెప్పుకునే కత్తి మహేష్ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి మీడియాలో ఫేమస్ అయ్యారు. ఆ తరువాత మహిళా సంఘాలు దారుణంగా వ్యతిరేకించిన వర్మ జీఎస్టీ చిత్రంపై ప్రశంసలు కురిపించాడు.

ఏకంగా శ్రీరాముడిపైనే
తాజాగా శ్రీరామ చంద్రుడినే దారుణంగా దూషించడం మొదలు పెట్టాడు. కత్తి మహేష్ చర్యలు అదుపు తప్పుడుతుండడంతో హిందూ సంఘాలు, రాజకీయ తీవ్రంగా ఖండిస్తున్నారు. అతడికి కావలసినంత ప్రచారాన్ని కల్పిస్తున్న కొన్ని మీడియా సంస్థలపై కూడా విమర్శలు అధికంఅవుతున్నాయి .

దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన నాగబాబు
కత్తి వ్యవహారంపై మెగా బ్రదర్ నాగబాబు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే రాముడిపై వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తడిని కఠినంగా శిక్షించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులని నాగబాబు కోరారు.

ఒక వీధి కుక్క అంటూ
కత్తి మహేష్ ఒక వీధి కుక్క అంటూ శ్రీరెడ్డి తనట్విట్టర్ అకౌంట్ లో ఘాటువ్యాఖ్యలు చేసింది. దేవుడు అనేది ఒక నమ్మకం. నీకు నమ్మకం లేకపోతే మూసుకుని కూర్చో అంటూ విరుచుకుపడింది. ఇంకా దారుణమైన వ్యాఖ్యలు అతడిపై చేసింది.
పేస్ బుక్ లో ట్విస్ట్
శ్రీరెడ్డి కత్తి మహేష్ పై చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ పేస్ బుక్ పేజీలో మాత్రం శ్రీరెడ్డి ట్విస్ట్ ఇచ్చింది. తాను కత్తి మహేష్ పై ఎలాంటి కామెంట్స్ చేయలేదని తెలిపింది. తనపేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్స్ అన్నీ ఫేక్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది.

ఈ అకౌంట్ నుంచే
కత్తి మహేష్ పై తీవ్రమైన విమర్శలు చేసిన అకౌంట్ నుంచే గతంలో శ్రీరెడ్డి పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.ఇప్పుడు మాత్రం అది ఫేక్ అకౌంట్ అంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు.

బిగుసుకుంటున్న ఉచ్చు
ఏదై ఏమైనా కత్తి మహేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో కత్తి మహేష్ హద్దులు దాటేలా కామెంట్స్ చేస్తున్నాడు. అతడిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాన్ని అందరూ వ్యక్త పరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











