'మన గడప తొక్కిన ఆడబిడ్డతో రాజకీయం ఏంట్రా'.. హాట్ టాపిక్‌గా మారిన 'యాత్ర' డైలాగ్స్!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర చిత్రం రూపొందించారు. మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రలో నటించారు. మమ్ముట్టి హావభావాలు ఈ చిత్రంలో రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసేలా ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ ఎమోటినల్ జర్నీ యాత్ర నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వైఎస్ఆర్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు, డైలాగ్స్ ని పంచుకుంటూ సంతోషిస్తున్నారు.

వైరల్ అవుతున్న డైలాగ్

వైరల్ అవుతున్న డైలాగ్

ఈ చిత్రంలో ఓ సన్నివేశాన్ని ఫ్యాన్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వైఎస్ పక్కనే ఉన్న అనుచరుడు ఒకరు.. అతడు ఎప్పుడూ మన నాశనాన్నే కోరుకున్నాడు.. అట్లాంటోడి కూతురికి మనం సాయం చేసేది ఏంటన్నా అని అనగా.. వైఎస్ పాత్రలో ఉన్న మమ్ముట్టి చెప్పే డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. మన గడపతొక్కి సాయమడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏంట్రా అని బదులిస్తాడు. ఈ డైలాగ్ ని చాలా మంది వైఎస్ అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

రియల్ ఫుటేజీ

రియల్ ఫుటేజీ

యాత్ర చిత్రంలో వైఎస్ జగన్ కు సంబంధించిన సన్నివేశాల కోసం రియల్ ఫుటేజీని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పొలిటికల్ హీట్ నేపథ్యంలో యాత్ర చిత్రం ఎంతో కొంత ప్రభావం చూపే విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథాయనకుడు విడుదల అయింది. దీనితో సోషల్ మీడియా వేదికగా రెండు చిత్రాల మధ్య పోలిక కూడా జరుగుతోంది.

చివరి 10 నిమిషాలలో

చివరి 10 నిమిషాలలో

యాత్ర చిత్ర చివరి 10 నిమిషాలలో వైఎస్ జగన్ కు సంబందించిన సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ రాజకీయాలకు యాత్ర చిత్రం మైలేజ్ తీసుకొస్తుందని కూడా భావిస్తున్నారు. దర్శకుడు మహి వి రాఘవ్ ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాదయత్రని చాలా ఎమోషల్ గా చూపించారు. అభిమానులు ఈ చిత్రానికి బాగానే కనెక్ట్ అవుతున్నా కామన్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.

విమర్శాత్మక సన్నివేశాలు

విమర్శాత్మక సన్నివేశాలు

ఈ చిత్రంలో తెలుగు దేశంపార్టీని విమర్శించే విధంగా ఉండే కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం సమయంలో చేసిన వ్యాఖలని కూడా ఈ చిత్రంలో చూపించారట. మొత్తంగా యాత్ర చిత్రం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X