ఆ హీరోయిన్ గర్బవతి అనగానే.. అసహ్యం వేసింది.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

Ram gopal varma: సంచనాలు, వివాదాలకు కేరాఫ్ ఆర్జీవీ. ఆయన ఏం చేసిన కాంట్రవర్సీయే. అలా వివాదాలతోనే బోల్డెంత పబ్లిసిటీ సంపాదించుకున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. నిజంగా పైసా ఖర్చు లేకుండా సినిమాను ఎలా ప్రమోషన్ చేయాలో తనను చూసి నేర్చుకోవచ్చు. అసలు ఏం లేకుండా కూడా భారీ హైప్‌ ను క్రియేట్ చేయగల సమర్థుడు ఆర్జీవీ తాజాగా అందులో ఎవర్ గ్రీన్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

బయోపిక్స్, కాంట్రవర్సీలతోనే వర్మ సినిమాలు తీయడంలో తనకు తానే సాటి.. ఈ సమయంలో ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా 'డోట్ కేర్' అంటూ ముందుకు సాగుతారు. ఎదుట వ్యక్తే.. వీడితో పెట్టుకుంటే మన పరువే పోతుందని సైడ్ అవుతారు. ఆర్జీవి మాత్రం ఎక్కడ తగ్గేదేలే అన్నట్లుగా ప్రవర్తిస్తుంటాడు. అందుకే ఆయనకు అంత ఫేమస్.

ఇక ఆయన ఇంటర్వ్యూలు ఓ రేంజ్.. ఏ విషయానైనా ముక్కుసూటిగా .. బయటవ్యక్తి ఏం అనుకుంటారో అనే ఫీలింగ్ లేకుండా బట్టలు విప్పి మాట్లాడినట్టు చాలా బోల్డ్ గా మాట్లాడుతారు. తాజాగా సంచనాల కేరాఫ్ ఆర్జీవికి సంబంధించిన ఓ వీడియో ఒకటి నెటింట్లో తెగ వైరల్ అవుతుంది. అందులో ఎవర్ గ్రీన్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

sensational director ram gopal varma made bold comments on Aishwarya Rai Bachchan pregnancy

ఈ ఇంటర్వ్యూలో ఆర్జీవి మాట్లాడుతూ.. ఐశ్వరరాయ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు.. ఆమెకు తాను ఓ లాంగ్ మెసేజ్ పెట్టానని తెలిపారు. అందులో తాను ఇలా రాశానంటూ.. ఒక అందమైన అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే.. తాను భరించలేనని ఎందుకంటే.. వాళ్ల ప్రెగ్నెంట్ అయితే.. అందమైన అమ్మాయిల షేప్ పోతుందని, ఈ ప్రకృతిలో పిల్లలు కనడానికే స్త్రీలను భగవంతుడు స్రుష్టించారనే భావన తనకు చిరాకు పెడుతుందని, ఆ ఫీలింగ్ కరెక్ట్ కాదని అన్నారు.

పిల్లలు కనడం వల్ల హాట్ బ్యూటీస్ అందం చెడిపోతుందని, పిల్లలు వారి అందాన్ని చెడగొడతారని, అందుకే అందమైన భామలు పిల్లలు కనడం తనకు నచ్చదని, మీకు, అభిషేక్ పిల్లలు కనడం ఇష్టమైతే.. తాను కూడా ఆనందంగా ఉన్నట్టు నటిస్తాను అని రాసి క్యూట్ బ్యూటీ ఐశ్వర్య కు టెక్స్ట్ చేశారని చెప్పకు వచ్చారు.

అందుకు ఐశ్వర్య చాలా ఎమోషనల్ గా రియాక్ట్ అవుతూ 'ఐ లవ్ యు టూ రాము'అంటూ మెసేజ్ పెట్టారని షాపింగ్ విషయాన్ని బయటపెట్టారు. గతంలో కూడా సెక్స్, బోల్డ్, వల్గారిటీ వంటి విషయాలపై ఆర్జీవీ ఓపెన్‌గా కామెంట్ చేశారు. ఆయన తన సినిమాల్లోనూ ఇలాంటి అంశాలకే పెద్దపీట వేస్తుంటారు. ఆయన ఎక్కడా వెనక్కి తగ్గడనేది ఇండ్రస్టీలో టాక్.

sensational director ram gopal varma made bold comments on Aishwarya Rai Bachchan pregnancy

ఇక ఐశ్వర్యారాయ్ మాజీ ప్రపంచ సుందరి.విషయానికి వస్తే.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాలుగు పదుల వయస్సులోనూ ఆమె అందానికి కేరాఫ్. ఆమె తన అందంతోనే కాదు నటనతో కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇరువర్ అనే తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐశ్వర్యారాయ్ తన మొదటి సినిమాతోనే ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. ఇక అక్కడి నుంచి తన నటప్రస్థానం ప్రారంభమైంది.

కెరీర్ ఫిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అందాల భామ ఐశ్వర్యరాయ్... బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ను 2007లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరికి ఓ కూతురు కూడా ఉంది. ఆ చిన్నారే ఆరాధ్య . అయితే.. ఇటీవలీ కాలంలో సోషల్ మీడియాలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ జంట విడిపోబోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జోరుగా జరుగుతోంది.

More from Filmibeat

Read more about: rgv aishwarya rai bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X