హిందీ ‘మగధీర’ని కూడా డైరెక్ట్ చేయనున్న రాజమౌళి...
తెలుగులో సూపర్ హిట్ అయిన 'మగధీర' సినిమాని హిందీలో రీమేక్ చేసి, అక్కడ కూడా తన సత్తా చాటాలని దర్శకుడు రాజమౌళి తెగ ఉబలాటపడిపోతున్నాడు. ఈ సినిమాని ఆమిర్ ఖాన్ తో రీమేక్ చేయాలని మొదట్లో చాలా ప్రయత్నించాడు. ప్రింట్ పట్టుకెళ్ళి స్వయంగా దగ్గరుండి మరీ సినిమా చూపించాడు. అయితే, ఆమిర్ ఈ కథ తనకు సూట్ కాదంటూ తప్పించుకున్నాడు.
తర్వాత మళ్లీ హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ ని ట్రై చేసినా... అక్కడా అదే సమాధానం రావడంతో ఇక ఇప్పుడు రణభీర్ కపూర్ తో చేయడానికి రాజమౌళి ఫిక్స్ అయిపోయాడు. రణభీర్, రామ్ చరణ్ పాత్రను పోషించనున్నాడు. అయితే హిందీ వెర్షన్ లో కూడా రామ్ చరణ్ ను నటింపచేయవలసి ఉన్నా, అతనికి జాతీయస్థాయిలో అప్పీల్ లేనందున, బాలీవుడ్ స్టార్స్ నే ఎంపిక చేసుకోవడం జరింగిందంటున్నారు. అయితే, కాజల్ పాత్రకి కత్రినాని తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడట. ఆమె కూడా సరే అంటే ఇక ఈ ప్రాజక్టుని వెంటనే ప్రారంభిస్తాడు. హిందీలో కూడా దీనిని అల్లు అరవిందే నిర్మిస్తారు.


Click it and Unblock the Notifications











