twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంగస్థలంలో ఎన్టీఆర్..అంచనాలు పెంచేస్తున్న సుకుమార్..నందమూరి ఫాన్స్ ఫిదా!

    |

    Recommended Video

    Senior NTR Role In Ranasthalam

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న రంగస్థలం చిత్రంపై రోజు రోజుకు అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి ఉన్న అనేక ప్రత్యేకతల వలన సినీవర్గాలు, అభిమానులు మొత్తం ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. రాంచరణ్ ఈ చిత్రంలో ఛాలంజింగ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రం గురించి తాజగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్త చిత్రంపై అమాంతం అంచనాలు పెంచే విధంగా ఉంది. ఈ చిత్రంలో 1985 నాటి రాజకీయాల ప్రస్తావన ఉంటుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాలకు సంబందించిన సన్నివేశాలలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రస్తావన ఉంటుందనేది లేటెస్ట్ న్యూస్.

    అదే మొదటి ఆకర్షణ

    అదే మొదటి ఆకర్షణ

    రంగస్థలం చిత్రంలో ఉన్న అనేక ప్రత్యేకతలు అందరిని ఆకర్షిస్తున్నాయి. 1985 నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుండడం ఆసక్తిని పెంచుతోంది. 1985 గోదావరి తీర ప్రాంతంలోని ఓ పల్లెటూరి కథగా సుకుమార్ ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు.

    రాంచరణ్ పాత్ర

    రాంచరణ్ పాత్ర

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో సవాల్ తో కూడుకున్న పాత్రని పోషిస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ చరణ్ ని వినికిడి లోపం ఉన్న యువకుడిగా చూపించనున్నాడు. టీజర్ లో సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా చరణ్ అందరిని అలరించిన సంగతి తెలిసిందే.

    రామలక్ష్మి అందాలు

    రామలక్ష్మి అందాలు

    సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా పేదింటి పిల్లగా కనిపించబోతోంది. రామలక్ష్మి గా టీజర్ లో సమంత ఆకట్టుకుంది. పల్లెటూరి పిల్లగా కనిపిస్తూనే తన నటన కనబరుస్తూ పల్లెటూరి భామలా అందాలు ఒలకబోస్తోంది.

    రాజకీయ నేపథ్యం

    రాజకీయ నేపథ్యం

    రంగస్థలం చిత్రం కేవలం పల్లెటూరి కథ మాత్రమే కాదు. ఈ చిత్రంలో 1985 నాటి రాజకీయ పరిస్థితులని చూపించబోతున్నట్లు తెలుస్తోంది.1985 నాటి మండల స్థాయి రాజకీయ పరిస్థితులని సుకుమార్ కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నాడట.

    రంగస్థలంలో ఎన్టీఆర్

    రంగస్థలంలో ఎన్టీఆర్

    ఈ చిత్ర రాజకీయ సన్నివేశాలలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ ప్రస్తావన ఉంటుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైనతే రామ్ చరణ్ సినిమాకు అందరూ క్యూ కట్టడం ఖాయం.

    అంచనాలు పెంచేస్తున్న సుక్కు

    అంచనాలు పెంచేస్తున్న సుక్కు

    దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. 1985 నటి పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకర్షిస్తున్నాడు.

    English summary
    Sensational news regarding Ram Charan' s Rangasthalam movie. Senior NTR role in Ranasthalam
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X