»   » తెలుగు సినీ నిర్మాతపై సెన్సార్ బోర్డు సభ్యురాలు దాడి

తెలుగు సినీ నిర్మాతపై సెన్సార్ బోర్డు సభ్యురాలు దాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ నిర్మాత శరత్‌కుమార్‌పై ప్రాంతీయ సినిమా సెన్సార్ బోర్డు సభ్యురాలు మంగారెడ్డి దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో శరత్‌కుమార్ తలకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం శరత్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మంగారెడ్డిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో శరత్ కుమార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. ఈ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ మధ్య కాలంలో తెలుగు ప్రాంతీయ సెన్సార్ బోర్డు పలు వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతోంది. ఇటీవల సెన్సార్ బోర్డు అధికారి నిర్మాత నుండి లంచం డిమాండ్ చేస్తూ సీబీఐకి అడ్డంగా దొరికి పోయారు. తాజాగా దాడి ఘటన చోటు చేసుకోవడంతో సినీ వర్గాలు ఆశ్చర్య పోయాయి.

Sensor board member attack on producer

అసలు దాడి ఘటన చోటు చేసుకోవడానికి కారణం ఏమిటి? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

English summary
Source said that, Sensor board member Manga Reddy attack on producer Sarath Kumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu