రాజమౌళి ఫాం హౌస్‌కు వెళ్లి అనుకోకుండా ‘విజేత’లో...

By Bojja Kumar

మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌‌ను హీరోగా పరిచయం చేస్తూ రాకేష్‌ శశి దర్శకత్వంలో సాయి కొర్ర‌పాటి నిర్మాతగా వారాహి చలనచిత్రం పతాకంపై రూపొందుతోన్న‌ చిత్రం 'విజేత'. జూలై 12న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందించిన కె. సెంథిల్‌కుమార్‌ మీడియాతో సినిమాకు సంబంధించిన వివరాలు పంచుకున్నారు.

బాహుబలి తర్వాత పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు రాలేదా? ఈ చిన్న సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? అనే ప్రశ్నకు సెంథిల్ కుమార్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సంక్రాంతికి రాజమౌళి ఫామ్‌హౌస్‌ వెళ్లినపుడు సాయికొర్రపాటి కలిశారు. ఏ సినిమా చేస్తున్నావని అడిగారు. ఏదైనా ఇంట్రస్టింగ్‌ ప్రాజెక్ట్‌ ఉంటే చేయాలనుకుంటున్నాను సార్‌ అని చెప్పడంతో 'విజేత' గురించి చెప్పారు. కథ నచ్చడంతో వెంటనే చేయడానికి ఒప్పుకున్నట్లు సెంథిల్ వెల్లడించారు.

Senthil Kumar about Vijetha movie

బాహుబలి తర్వాత బాలీవుడ్‌ అవకాశాలు వచ్చాయి. దఢక్‌‌తో పాటు చాలా పెద్ద సంస్థల నుండి ఆఫర్స్ వచ్చాయి. అయితే నాకు నచ్చిన కథలు రాలేదు. అందుకే కమిట్ కాలేదు. బాహుబలి తర్వాత హిందీ పరిశ్రమ పట్ల కాస్త ఆసక్తి తగ్గింది. ఎందుకంటే వరల్డ్‌ క్లాస్‌ టెక్నాలజీతో మన తెలుగులోనే సినిమాలు చేస్తున్నా. అలా అని హిందీ సినిమాలు చేయనని చెప్పడం లేదు, నాకు నచ్చితే చేస్తాను అని సెంథిల్ తెలిపారు.

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో గోల్డెన్ ఎరా నడుస్తుందని చెప్పొచ్చు. బాహుబలి, ఘాజీ, రంగస్థలం, అర్జున్‌ రెడ్డి, గరుడు వేగ, మహానటి.. లాంటి సినిమాలు వచ్చాయి. కొత్త కాన్సెప్టులపై ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతున్నారు. త్వరలోనే ఇండియన్‌ సినిమా అంటే తెలుగు సినిమా అనే రోజు తప్పకుండా వస్తుందని సెంథిల్ చెప్పుకొచ్చారు. టెక్నీషియన్లలో టాప్ టెక్నీషియన్ దర్శకుడు. అతడి విజన్ ప్రకారమే సినిమా రన్ అవుతుంది. నాకూ దర్శకత్వం చేయాలని ఉంది. అయితే ఎప్పుడు చేస్తానో తెలియదు అని ఓ ప్రశ్నకు సెంథిల్ సమాధానం ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X