మగధీర సెంధిల్...సుమంత్ సినిమాకి
మగధీర, అరుంధతి వంటి భారీ చిత్రాలకి సినిమాటోగ్రఫి అందించిన సెంధిల్ తాజాగా మరో చిత్రానికి కమిట్ అయ్యారు. అష్టాచెమ్మ చిత్రంతో పాపులర్ అయిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. క్రికెట్ మీద రాసిన ది మేన్ విత్ ఇన్ యు అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం కథ రూపొందించారు. ఆ పుస్తకం రాసిన హరి మోహన్ సోదరుడు రామ్ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే రాజమౌళి చిత్రాలకు రెగ్యులర్ గా ఆర్ట్ డైరక్షన్ చేసే రవీందర్...ఆర్ట్ వర్క్ చేయనున్నాడు. ఇక కీరవాణి సోదరుడు కళ్యాణ మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అష్టాచెమ్మలో చేసిన కలర్స్ స్వాతి ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.
మగధీర సుమంత్ అరుంధతి కళ్యాణ్ మాలిక్ సెంధిల్ హరి మోహన్ మోహన్ కృష్ణ magadheera sumanth mohan krishna kalyan malik sentil arundhati


Click it and Unblock the Notifications