twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Westin లో పవన్‌ ,సమంత మధ్య సీన్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీ షూటింగ్ హైరాబాద్ మాదాపూర్ లో జరుగుతోంది. అక్కడ లో Westin ఈ షూటింగ్ జరుగుతోంది. అక్కడ పవన్,సమంత మధ్య కొన్ని సీన్స్ తీసారు. హోటల్ నేపధ్యంలో ఆ సీన్ జరుగుతున్నట్లు ఫన్నీగా ఆ సీన్ ని త్రివిక్రమ్ తీసాడని సమాచారం. ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్ గా ప్రణీత ఎంపికయింది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రానికి నిర్మాత.

    ఇత పవన్‌ కల్యాణ్‌లోని అల్లరినీ, ఆవేశాన్ని సమపాళ్లలో చూపించారు త్రివిక్రమ్‌.. 'జల్సా' సినిమాలో. సంజయ్‌ సాహూగా పవన్‌ నటన ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు వీరిద్దరూ పూర్తిస్థాయి వినోదాత్మక కథతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి. సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది .

    ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో స్పెయిన్‌ కి షిప్ట్ అవనుంది. అక్కడ కీలక సన్నివేశాలు, పాటలు తెరకెక్కిస్తారు. సింహభాగం చిత్రీకరణ అక్కడే జరుగుతుంది. వినోదాత్మకంగా సాగే ఈ కథలో కుటుంబ బంధాలకూ చోటిచ్చారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సహ నిర్మాతలు: భోగవల్లి బాపినీడు, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌.

    ఈ చిత్రానికి సరదా', 'హరే రామ హరే కృష్ణ' టైటిల్స్ వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ చిత్ర దర్శక నిర్మాతలు టైటిల్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ సంగతి అలా ఉంచితే.... తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి ప్రస్తుతం 'తుఫాన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఏది ఏమైనా అధికారికంగా ఖరారు అయితే తప్ప దీన్ని నమ్మలేం.

    English summary
    'Jalsa' combo Pawan and Trivikram paired up again. This time this combo is going to enter the sweet homes of telugu audience and going to entertain them with family relation values. No, doubt it is going to have a loads of entertainment too. The shooting of the movie was started in Westin at Madhapur in Hyderabad. Scenes between Samantha and Pawan Kalyan were shot there.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X