19న వస్తున్న 'సమర్థుడు'

By Staff

రాజా కథానాయకుడుగా ఆకుల సురేష్, ఎం.వెంకట్రామిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన 'సమర్ధుడు' చిత్రం విడుదలకు సిద్ధమైంది. బి.గోపాల్, ఇవివి సత్యనారాయణ వంటి ప్రముఖ దర్శకుల వద్ద పనిచేసిన అర్జున్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాజాకు జోడిగా సంజన నటించగా, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరో కీలక పాత్ర పోషించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 19న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.

కర్తవ్య దీక్ష, కార్యదక్షత ఉన్న కథానాయకుడు అందరిచేతా ఎలా సమర్ధుడు అనిపించుకున్నాడన్నదే ఈ చిత్రకథ అనీ, ఈ చిత్రంతో రాజాకు మాస్ ఇమేజ్ వస్తుందనీ, నిజాయితీ గల రాజకీయ నాయకుడుగా కృష్ణంరాజు పాత్ర హైలైట్ అవుతుందనీ వారు తెలిపారు. సంజన అభినయంతో కూడిన గ్లామర్ పాత్రను పోషించిందన్నారు. దర్శకుడు అర్జున్ సమర్ధవంతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, లవ్, యాక్షన్, సెటిమెంట్ వంటి అంశాలన్నీ ఇందులో ఉంటాయనీ, అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం అలరిస్తుందనే నమ్మకం ఉందనీ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో వినోద్ కుమార్, బ్రహ్మానందం, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, జీవా, సారికా రామచంద్రరావు, సలీమ్ పండా, తదితరులు నటించారు. ఈ సినిమాకి వి.రాజశేఖర్ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X