‘విశ్వరూపం-2 ఇండియా’... ‘మూ’ వేరే మూవీ: కమల్
హైదరాబాద్: విశ్వరూపం చిత్రం వలన అనేక ఆందోళనలు చెలరేగడం, సినిమాపై బ్యాన్ కారణంగా తమిళనాడులో ఈ చిత్రం నిలిచి పోవడం, కమల్ హాసన్ తీవ్రంగా నష్ట పోవడం తెలిసిందే. కమల్ హాసన్ తన సినిమాలో ఎవరినీ కించ పరచక పోయినా, ఏ మతం మనోభావాలు దెబ్బతీయక పోయినా..... రాజకీయాల కారణంగా ఈ సినిమా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది.
తాను ఏ తప్పూ చేయలేదని, తాను ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదని మొదటి నుంచి నిజాయితీగా వాదిస్తూ వస్తున్న కమల్ హాసన్... మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. విశ్వరూపం చిత్రానికి త్వరలో సీక్వెల్ కూడా రాబోంతోందని స్పష్టం చేసారు. ఈ చిత్రానికి 'విశ్వరూపం-2 ఇండియా' అనే టైటిల్ పెట్టబోతున్నట్లు తెలిపారు. 'మూ' అనేది వేరే సినిమాకు పెట్టబోయే టైటిల్ అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.
విశ్వరూపం చిత్రం తెలుగునాట విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో కమల్ హాసన్ శుక్రవారం తాజ్ బంజారాలో సక్సెస్ ప్రెస్ మీట్, తనకు అండగా నిలిచిన తెలుగు సినీ కళాకారులకు థాంక్స్ చెప్పేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ విశ్వరూపం సీక్వెల్ వివరాలు చెప్పుకొచ్చారు.
జనవరి 25న విడుదల కావాల్సిన 'విశ్వరూపం' చిత్రం.... ముస్లిం సంఘాల ఆందోళనతో తమిళనాడులో విడుదల నిలిచి పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కమల్ కోర్టు కెళ్లడం, కోర్టులోనూ చుక్కెదురు కావడం, చివరకు ముస్లిం సంఘాలతో చర్చలు జరిపి వారు అభ్యంతరం వ్యక్తం చేసిన సీన్లను తొలగించారు. దీంతో ఎట్టకేలకు నిన్న(ఫిబ్రవరి 7)న సినిమా విడుదయింది.


Click it and Unblock the Notifications











