twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోనియా గాంధీ కోసం 'జై బోలో తెలంగాణ' సీక్వెల్ తీస్తాను

    By Srikanya
    |

    తెలంగాణాపై పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టకుంటే జై బోలో తెలంగాణ రెండో బాగం(సీక్వెల్) కూడా తీస్తామని దర్శకుడు ఎన్.శంకర్ చెప్పారు. ఉస్మానియా విధ్యార్ధల ఐక్యవేదికకు ప్రత్యేకంగా తన సినిమా జై బోతో తెలంగాణా ను చూపిన ఎన్.శంకర్ ఈ విధంగా స్పందించారు. అలాగే..తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా తెలంగాణా ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల ఇతివృత్తంగా తీసిన ఈ సినిమాను ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని అన్నారు. పార్లమెంట్ లో తెలంగాణా బిల్లను పెట్టకపోతే సీక్వెల్ తీస్తానన్నారు. అంతేగాకుండా తాను సోనియా గాంధీకి ఈ సినిమా చూపిస్తానని, సినిమా చూసే ముందు సోనియాగాంధి సినిమా చూసి కన్నీళ్ళు పెట్టుకుంటే వెంటనే తెలంగాణాను ఇవ్వాలన్న షరుతో తెలంగాణా సినిమా ను రూపొందించనున్నట్లు శంకర్ తెలిపారు. ఇక జై బోలో తెలంగాణా చిత్రంలో జగపతిబాబు ప్రత్యేకపాత్ర వేశారు. స్మృతి ఇరానీ ఈ చిత్రంలో కీలకమైన పాత్రను చేసింది.

    ఈ చిత్రంద్వారా మీరా నందన్ అనే కేరళ అమ్మాయి తెలుగు తెరకు పరిచయం అయ్యింది. గద్దర్ పాట ఈ చిత్రంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి సినిమాని నిలబెట్టింది.14 రీళ్ళ నిడివిగల 'జై బోలో తెలంగాణ' చిత్రం 4-2-2011న విడుదల అయింది. ఈ చిత్రాన్ని మహలక్ష్మి ఆర్ట్‌ పతాకాన ఎన్‌. శంకర్‌ నిర్మించారు. సందీప్‌ మీరానందన్‌, జగపతి బాబు, స్మృతి ఇరాని, నాగినీడు ముఖ్యపాత్రలు పోషించారు. సంగీతం చక్రి, సినిమాటోగ్రఫీ సురేందర్‌రెడ్డి నిర్వహించిన ఈ చిత్రానికి కథ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎన్‌. శంకర్‌.

    English summary
    N Shankar is all set to make a sequel of ‘Jai Bolo Telangana’. Director claims that he is going to discuss ‘Palamuru’ issue in this sequel of ‘Jai Bolo Telangana’. Well, the first part fared well at box office but was not that successful in melting the hearts of the honorable people in supreme positions, who are presently in charge of the Telangana issue. Hope the sequel of the movie helps in creating an impact on the viewers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X