సూపర్ హిట్ 'పెళ్ళాం ఊరెళితే' చిత్రానికి సీక్వెల్
శ్రీకాంత్, వేణు కాంబినేషన్ లో ఎస్.వి.కృష్ణారెడ్డి దర్సకత్వంలో వచ్చిన పెళ్ళాం ఊరెళితే చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే.ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ రెడీ కాబోతోంది.శివాజి హీరోగా ఈ చిత్రం త్వరలో తెరకెక్కబోతోంది.గతంలో 'సారి...నాకు పెళ్ళయింది','ప్లీజ్ ...నాకు పెళ్ళయింది' వంటి కామిడీ చిత్రాలు డైరక్ట్ చేసిన గాంధీ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నట్లు సమాచారం.ఈ చిత్రానికి టైటిల్ గా 'వంశీ భార్య ఊరెళ్ళెంది' అని పిక్స్ చేసినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.
పూర్తి కామిడీతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.టైటిల్ బట్టి పెళ్ళాం పుట్టింటికెళితే ఏం జరుగుతుందనే విషయాన్ని ఫన్నీగా దర్శకుడు మరో సారి చెప్పబోతున్నట్లు అర్దమవుతుంది.గతంలో అదిరిందయ్యా చంద్రం,మిస్సమ్మ,శ్రీరామచంద్రులు వంటి ఫ్యామిలీ చిత్రాలలో నటించిన శివాజి ఈ చిత్రం కమిటవటంతో పరిశ్రమ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.తన వయస్సుకి తగని లవ్ స్టోరీలని ఎన్నుకుని వరస ఫెయిల్యూర్స్ ని తెచ్చిపెట్టుకున్న శివాజి ఈ చిత్రంతో అయనా పూర్వ వైభవం పొందుతాడని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











