రవితేజ..ఫ్యాషన్ డిజైనర్
వరస కామిడీలతో దూసుకుపోతున్న రవితేజ త్వరలో ఫ్యాషన్ డిజైనర్ అవతారం ఎత్తనున్నాడు. ఎనభైల్లో వంశి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన లేడీస్ టైలర్ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. అలాగే ఈ సారి లేడీస్ టైలర్ కాస్తా సిటీల్లో ఉండే ఫ్యాషన్ డిజైనర్ గా మారనున్నాడు. ఈ ఫ్యాషన్ డిజైనర్..లేడీస్ కి బట్టలు డిజైన్ చేయటంలో నైపుణ్యం కలిగి ఉంటాడని సమాచారం. అలాగే టైటిల్ కూడా ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ అని పెడుతున్నారు. పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఈ స్క్రిప్టు తయారు చేస్తున్నారు.
ఇక ఈ కథతో అల్లరి నరేష్ హీరోగా సినిమా చేస్తారని మొదట ప్రచారం జరిగింది. అయితే అవును..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాంబినేషన్ రిపీట్ అయితే క్రేజ్ వచ్చే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమలో టాక్. ఇక ఈ చిత్రాన్ని వల్లూరిపల్లి రమేష్ నిర్మిస్తున్నాడు. ఆయన లేటెస్ట్ గా ఆనంది ఆర్ట్స్ వారితో కలిసి వంశి దర్శకత్వంలో గోపి..గోపిక..గోదావరి చిత్రాన్ని నిర్మించారు. అయితే అది భాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజిలో రిజల్ట్ ఇవ్వలేదు. ఇక ఈ ఫ్యాషన్ డిజైనర్ సినిమా వచ్చే జనవరిలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం రవితేజ ఆంజనేయులు షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అనంతరం నాడోడిగల్ రీమేక్ లో చేస్తారు. దానని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











