బావ ఏదైనా సినిమాలుంటే ఇప్పించు అని అడుగుతా.. నాగబాబుపై జయలలిత కామెంట్స్
వెండితెరపై, బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను ఏర్పర్చుకుంది నటి జయలలిత. వెండితెరపై ఘాటుగా, నాటుగా కనిపించే జయలలిత బుల్లితెరపై మాత్రం పెద్దరికంతో కూడిని పాత్రలను పోషిస్తూ వస్తోంది. బుల్లితెరపై జయలలిత పలు సీరియళ్లతో బిజీగా ఉంది. ఆమె నటించే ప్రతీ సీరియల్‌లో హుందాగా, పాత్రకు గొప్పదనం తీసుకొచ్చేలా, ఊరి పెద్ద మనిషి తరహా పాత్రలు పోషిస్తూ ముందుకు సాగుతోంది.

తాజాగా అలా..
జయలలిత తాజాగా అలీతో సరదాగా షోలో గెస్ట్‌గా విచ్చేసింది. ఇక ఆ ప్రోగ్రాంలో తన బాధలు, కష్టాలు,మోసపోయిన తీరు, ఇండస్ట్రీ వ్యవహారాలను అన్నీ కూడా బయటపెట్టేసింది. తాను ఓ నిర్మాత చేతిలో నాలుగు కోట్లు మోసపోయిన సంగతిని చెబుతూ కన్నీరు పెట్టేసుకుంది.

రామానాయుడు అలా..
రామానాయుడు బతికున్న సమయంలో బాగోగుల గురించి అడిగేవారు.. ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగేవారు... డబ్బులున్నాయా? ఏదైనా ఇబ్బంది ఉందా? సినిమాలున్నాయా? లేదంటే వచ్చి డబ్బులు తీసుకెళ్లు అని అనేవారంటూ జయలలిత చెప్పుకొచ్చింది. ఆతరువాత నాగబాబు అలా చూసుకుంటున్నారు అని తెలిపింది.

ప్రత్యక్ష దైవం..
నాకు కనిపించని దైవం ఆ పరమేశ్వరుడు అయితే కనిపించే దైవం మాత్రం నాగబాబు.. నాకు ఏ అవసరం వచ్చినా సరే ఆదుకుంటారు.. లాక్డౌన్ కరోనా సమయంలో ఎన్నో సార్లు సాయం చేశారు. ఇలా నాలుగు కోట్లు మోసపోయాను అని తెలిశాక ఇంటికి పిలిచి మాట్లాడారు అని జయలలిత చెప్పుకొచ్చింది.

డబ్బులు ఇచ్చారు..
ఇంటికి వెళ్లిన ప్రతీసారి ఆయనకు పాదాభివందనం చేస్తుంటాను.. ఆ విషయం చెప్పుకోవడానికి సిగ్గు పడను..నా అకౌంట్ నంబర్ అడిగి డబ్బులు వేశారు. కరోనా లాక్డౌన్‌లో ఎన్నో సార్లు ఫోన్ చేశారు. చలపతి గారు కూడా ఫోన్ చేస్తారు.వాయిస్‌లో ఏదైనా డౌట్ వస్తే.. వీడియో కాల్ చేసి మరీ మాట్లాడతారు అని తెలిపింది.

అలా అడుగుతా..
బావ ఏదైనా సినిమా అవకాశాలు ఉంటే ఇప్పించు అని అడుగుతాను.. నా ముందే ఎంతో మందికి ఫోన్ చేసి మరీ అడుగుతాడు.. అలా అడగాల్సిన అవసరం లేదు కానీ అడుగుతారు అని నాగబాబు గొప్ప దనం గురించి జయలలిత చెప్పుకొచ్చింది. ఈ ఇద్దరూ ఎన్నో సినిమాలు, సీరియల్స్‌లో కలిసి నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











