ఆ టైపు హీరోని...ఫ్యామిలీ ప్రేక్షకులు ఆదరిస్తారా?
అయితే తనపై ఉన్న కిస్సర్ ఇమేజ్ నుంచి బయట పడటానికి...ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఇమ్రాన్. ప్రస్తుతం అతను 'ఘన్ చక్కర్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో ఇమ్రాన్ సరసన విద్యా బాలన్ నటిస్తోంది.
ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇమ్రాన్ మాట్లాడుతూ....'ఘన్ చక్కర్' చిత్రం మంచి ప్యామిలీ ఎటర్ టైనర్. భవిష్యత్ లో తాను ఎంచుకునే సినిమాలన్నీ ఇలాంటివే ఉంటాయి. కుటుంబ కథా చిత్రాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాను అని చెప్పుకొచ్చారు. మరి సీరియల్ కిస్సర్ ఇమేజ్ తొలగించుకోవడానికి ఫ్యామిలీ చిత్రాల బాట పడుతున్న ఇతగాడిని ఫ్యామిలీ ప్రేక్షకులు ఆదరిస్తారో? లేదో?
ఈ చిత్రంలో ఇమ్రాన్ మాజీ మోసగాడిగా నటిస్తున్నాడు. విద్యా బాలన్ పంజాబీ హౌస్ వైఫ్ పాత్ర చేస్తోంది. ఈ చిత్రం డిఫరెంట్ టైపు కామెడీతో, ఫన్నీగా సాగుతుందని ఇమ్రాన్ హస్మి చెబుతున్నారు. గతంలో విద్యా బాలన్, ఇమ్రాన్ డర్టీ పిక్చర్ లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య మంచి కెమెస్ట్రీ వర్కౌట్ అయిందని అంటున్నారు.


Click it and Unblock the Notifications












