మాజీ ప్రధాని జీవితం అయితే టి.ఆర్.పి రేటింగ్స్ బాగా పెరుగుతాయని వారు గ్రహించినట్లున్నారు.అందుకే ఇందరా గాంధీ జీవితాన్ని టీవీ సీరియల్ గా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. ఇందిర కూతరుగా ,భార్యగా,తల్లిగా,దేశనేత గా వివిధ దశలలో సమర్ధవంతంగా జీవితాన్ని గడిపిన వైనాన్ని చిత్రీకరిస్తామంటున్నారు దర్శక,నిర్మాతలు. ఛానెల్ 9X అనే లీడింగ్ హిందీ ఛానెల్ ఈ బయో పిక్ ని తెరకెక్కించటానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని ఐ.ఎన్.ఎక్స్ మీడియో అధినేత సి.ఈ.వో అయిన ఇంద్రాణి ముఖర్జీ ఈ విషయాన్ని స్ఫష్టం చేస్తోంది. త్వరలో హిందీ,ఇంగ్లీష్ లలో తయారయ్యే ఈ సీరియల్ సంచలనం సృష్టిస్తుందని ఆశిస్తున్నారు. అలాగే ఈ సీరియల్ కోసం అంతర్జాతీయంగా పేరొందిన దర్శకుల సలహాలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు. అలాగే ఓ బాలీవుడ్ మాజీ నటీమణి ఈ పాత్రకోసం ఫొటోసెషన్ జరిపినట్లు వినపడుతున్నాయి.ఎటువంటి కాంట్రావర్శీలకు తావివ్వకుండా ముందుగానే అన్ని పర్మిషన్స్ తీసుకోనున్నట్లు చెప్పుతున్నారు.అందుకై కొంత టైమ్ పెట్టినా నష్టమేమి లేదు గానీ మధ్యలో కోర్టు స్టేలు వంటి వాటితో ఆగిపోతే పరువు నష్టంగా భావిస్తామని చెప్తున్నారు.