హీరోల టైం బాగోలేదా? వరుస దెబ్బలు... ఎన్టీఆర్, చరణ్ నుంచి శర్వానంద్ వరకు!

తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కథానాయకులంతా ఒకరివెనక ఒకరు ఆసుపత్రి పాలవుతున్నారు. దీంతో షూటింగ్స్ అన్నీ వాయిదా పడుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది? మన హీరోల టైమ్ బాగాలేదా? అంటూ అభిమానుల్లో చర్చ సాగుతోంది.

ఒకరు లేదా ఇద్దరికి ఇలా జరిగిందంటే లైట్ తీసుకోవచ్చు... కానీ ఎన్టీఆర్, రామ్ చరణ్ మొదలు ఏడుగురు యంగ్ హీరోలు ప్రమాదాలకు గురి కావడం, ఈ సంఘటనలన్నీ ఈ రెండు నెలల గ్యాప్‌తో సంభవించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

రామ్ చరణ్‌తో మొదలు

రామ్ చరణ్‌తో మొదలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఈ గాయాల పరంపర మొదలైంది. RRR షూటింగ్ సమయంలో జిమ్ వర్కౌట్లు చేస్తుండగా... అతడి కాలుకు గాయమైంది. దీంతో దాదాపు 2 నెలలు షూటింగులో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు చిత్రీకరణ వాయిదా వేయకతప్పలేదు.

చరణ్ తర్వాత ఎన్టీఆర్ కూడా...

చరణ్ తర్వాత ఎన్టీఆర్ కూడా...

రామ్ చరణ్ గాయపడ్డ రెండు వారాలకే ఎన్టీఆర్ కూడా గాయపడ్డారు. అయితే అతడికి గాయం ఎలా అయిందనే విషయం బయటకు రాలేదు. పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ తన చేతికి కట్టుతో కనిపించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో ‘RRR' మూవీ షూటింగ్ మరింత ఆలస్యం అవుతూ వచ్చింది.

హీరో నాని

హీరో నాని

నేచురల్ స్టార్ నాని కూడా గాయపడ్డారు. అతడి కాలుకు ఇంజురీ అవ్వడం వల్ల ప్రస్తుతం నటిస్తున్న ‘గ్యాంగ్ లీడర్' చిత్రం షూటింగ్ నిలిపివేశారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో సోమవారం నుంచి ఢిల్లీలో సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్ కారు ప్రమాదం

వరుణ్ తేజ్ కారు ప్రమాదం

మరో యంగ్ హీరో, మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ ‘వాల్మీకి' షూటింగ్ కోసం కర్నూలు వెళుతుండగా అతడి కారు ప్రమాదానికి గురైంది. అదృష్టం కొద్దీ వరుణ్ తేజ్ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. అయితే అతడి కారు మాత్రం నుజ్జునుజ్జు అయింది.

నాగ శౌర్య

నాగ శౌర్య

వరుణ్ తేజ్ కారు ప్రమాదానికి గురైన మరుసటిరోజే యంగ్ హీరో నాగ శౌర్య సైతం గాయపడ్డారు. వైజాగ్‌లో ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘అశ్వథామ' షూటింగులో ఈ సంఘటన చోటు చేసుకుంది. మోకాలు భాగంలో గాయం కావడంతో వైదుల్యు నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట.

సందీప్ కిషన్

సందీప్ కిషన్

గాయాల పాలైన హీరోల లిస్టులో సందీప్ కిషన్ కూడా చేరారు. సందీప్ కిషన్ నటిస్తున్న ‘తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్' షూటింగులో నిన్న (జూన్ 15) బాంబ్ బ్లాస్ట్ జరిగిన సమయంలో అతడికి ముఖంపై గాయాలయ్యాయి. అయితే ఇది అనుకోకుండా జరిగిన గాయమే, స్టంట్ కొరియోగ్రాఫర్లను బ్లేమ్ చేయవద్దని సందీప్ కిషన్ సూచించారు.

శర్వానంద్ భుజానికి తీవ్రగాయం

శర్వానంద్ భుజానికి తీవ్రగాయం

‘96' మూవీ రీమేక్ కోసం.... శర్వానంద్ థాయ్‌లాండ్‌లో స్కైడైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డారు. ఆదివారం అతడిని హైదరాబాద్ తరలించారు. భుజానికి తీవ్రగాయం కావడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. కాలుకు కూడా ఫ్యాక్చర్ అయింది. సోమవారం అతడికి శస్త్ర చికిత్స జరుగబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X