బాలయ్య ఇక నందిమూరి.. నంది కాదు.. నందమూరి అవార్డులని విమర్శలు

By Rajababu

Recommended Video

నందమూరి కాదు.. నందిమూరి బాలయ్య

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నంది అవార్డుల ఎంపికపై సోషల్ మీడియాలో విమర్శలు ఆగడం లేదు. నంది అవార్డుల కోసం సినిమా ఎంపిక జరుగలేదు. కేవలం పంపకాలు మాత్రమే జరిగాయి అనే వాదనను సోషల్ మీడియాలో నెటిజన్లు బలంగా వినిపిస్తున్నారు. ఈ వ్యవహారం మీడియాలో కూడా చర్చనీయాంశమవుతున్నది. ఈ వ్యవహారంపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ నంది అవార్డులు కావు.. నందమూరి అవార్డుల అనే స్థాయికి ఆరోపణలు చేరాయి. కొందరు విమర్శకులైతే నందమూరి బాలక‌‌‌ృష్ణ కాదు.. నందిమూరి బాలకృష్ణ అనే కామెంట్లు చేస్తున్నారు.

 నంది అవార్డులపై తీవ్ర విమర్శలు

నంది అవార్డులపై తీవ్ర విమర్శలు

2014, 15, 16 సంవత్సరాలకుగాను ఆంధ్ర ప్రదేశ్ ప్రకటించిన నంది అవార్డుల విషయంలో అటు టాలీవుడ్‌లోనూ, ఇటు సోషల్‌ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ పార్టీకి అనుకూలంగా పనిచేసిన వారికి, ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్న హీరోలు, డైరెక్టర్లకే నంది అవార్డులను పంచారు అని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

లెజెండ్‌కు 9 నంది అవార్డులా

లెజెండ్‌కు 9 నంది అవార్డులా

టీడీపీ ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన 'లెజెండ్‌' చిత్రానికి నంది అవార్డుల్లో పెద్దపీట వేయడం ప్రధానంగా విమర్శలకు తావిచ్చింది. లెజెండ్‌కు ఏకంగా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ విలన్‌ ఇలా తొమ్మిది నంది అవార్డులు దక్కాయి. అయితే, మాస్‌ మసాల కమర్షియల్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఇన్ని నంది అవార్డులు రావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 మెగా హీరోలకు అన్యాయం

మెగా హీరోలకు అన్యాయం

నంది అవార్డుల ఎంపిక విషయంలో మెగా హీరోలకు తీవ్ర అన్యాయం జరిగింది. మెగా హీరోల సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. రుద్రమదేవి లాంటి చారిత్రాత్మక చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్ర లాంటి కీలక పాత్రను పోషించిన అల్లు అర్జున్‌కు 'బెస్ట్‌ క్యారెక్టర్‌ యాక్టర్‌' అవార్డుల ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

 బన్నీవాసు ఫైర్

బన్నీవాసు ఫైర్

టీడీపీ ప్రభుత్వాన్ని చూసి మెగా హీరోలు నటన నేర్చుకోవాలి. నంది అవార్డులు రావాలంటే.. తక్షణం చంద్రబాబు సర్కారు వద్ద శిక్షణ పొందాలి. నంది అవార్డుల్లో మెగా ఫ్యామిలీకి తీవ్ర అన్యాయం జరిగింది. అల్లు అర్జున్‌కి ఉత్తమ క్యారెక్టర్‌ నటుడు అవార్డు ఇచ్చి అవమానించారు' అని గీతా ఆర్ట్స్‌ కో ప్రొడ్యూసర్‌ మేనేజర్‌, నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

 అక్కినేని మనంకు అవమానం

అక్కినేని మనంకు అవమానం

తెలుగు సినిమా పరిశ్రమ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం ‘మనం' పరిగణనలోకి తీసుకోవడంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చక్కని కుటుంబ కథా చిత్రంగా రూపొందిన మనం చిత్రాన్ని కాదని, కమర్షియల్ హంగులతో తెరకెక్కిన లెజెండ్‌కు అవార్డులు ఇవ్వడమా అని అంటున్నారు. టాలీవుడ్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఏఎన్నాఆర్‌ను గౌరవించుకోవడం ఇదేనా అని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.

 చైతూ అవార్డును బహిష్కరించు

చైతూ అవార్డును బహిష్కరించు

మనం సినిమాకు అక్కినేని నాగచైతన్యకు ఉత్తమ సహాయ నటుడి అవార్డును ఇవ్వడంపై మండిపడుతున్నారు. ఆ అవార్డును స్వీకరించవద్దు అని అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ అవార్డును బహిష్కరించాలి అని సూచిస్తున్నారు.

 రుద్రమదేవికి నిరాదరణ

రుద్రమదేవికి నిరాదరణ

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే విధంగా రుద్రమదేవి సినిమాను దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించారు. అలాంటి చిత్రాన్ని నంది అవార్డుల్లో విస్మరించడంపై గుణశేఖర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను రాయితీని ఇచ్చి రుద్రమదేవికి ఇవ్వకపోవడంపై ప్రశ్నించినందుకే తన చిత్రానికి అవార్డులు ఇవ్వలేదనే ఆరోపణను గుణశేఖర్ సంధించినట్టు వార్తలు వచ్చాయి.

 విమర్శిస్తే మూడేళ్లు అనర్హత

విమర్శిస్తే మూడేళ్లు అనర్హత

నంది అవార్డుల ఎంపికను ఎవరు ప్రశ్నించినా వారిని మూడేళ్లపాటు అవార్డులకి అనర్హులుగా ప్రకటిస్తామని హెచ్చరికలు పంపినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బన్నీవాసు, గుణశేఖర్ సోషల్ మీడియాలో తమ పోస్టులను తొలగించడం కూడా చర్చనీయాంశమైంది.

సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తే..

సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తే..

నంది అవార్డుల ఎంపికలో ఓ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని విమర్శలు చేయడం సరికాదు అని జ్యూరీ సభ్యులు, మరికొంత మంది సినీ ప్రముఖులు అంటున్నారు. టాలీవుడ్‌ పరిశ్రమను ఎక్కువగా ప్రభావితం చేసేది.. దానిని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నవారిలో ఓ వర్గం ముందుండి నడిపిస్తున్నది. ఆ సామాజిక వర్గం వారిదే అధిక పాత్ర అయినప్పుడు, వారే ఎక్కువగా సినిమాలు తీస్తున్నప్పుడు వారికి అవార్డులు రావడంలో తప్పేమిటి అనే వాదనను కూడా వినిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X