క్రేజీ టైటిల్‌తో అల్లు అర్జున్.. మహేష్ హ్యాండిచ్చినా సుకుమార్‌లో అదే ఊపు
సంక్రాంతి బరిలో విన్నర్‌గా నిలిచిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జోరు కొనసాగుతూనే ఉంది. అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ విజయం ఇచ్చిన జోష్‌తో విభిన్నమైన పాత్రలో కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. త్రివిక్రమ్ హ్యట్రిక్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్‌తో జతకట్టాడు. తాజాగా సుకుమార్ సినిమా కోసం అల్లు అర్జున్ చేస్తున్న కసరత్తు మీడియాలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

మహేష్‌బాబు షాకిచ్చినా..
వాస్తవానికి రంగస్థలం సినిమా హిట్ తర్వాత ప్రస్తుతం అల్లు అర్జున్‌తో చేస్తున్న కథను ముందుగా మహేష్ బాబుకు సుకుమార్ చెప్పారు. అయితే కథలో మార్పులు చేయమని సూచించిన మహేష్.. ఆ తర్వాత నాన్చడంతోపాటు.. అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సుకుమార్ షాక్ తిన్నారు. వెంటనే అల్లు అర్జున్‌తో కథను ఒకే చేసి లైన్‌లో పెట్టేశాడు.

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌తో
ఇంతకు ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సుకుమార్ చేస్తున్న కథేంటంటే.. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్. చిత్తూరు జిల్లా, తమిళనాడు సరిహద్దులో సాగే అక్రమ కలప రవాణా కథాంశంగా సాగే యాక్షన్, థ్రిల్లర్ కథ. ఈ సినిమా అంతా చిత్తూరు నేటివిటీతో సాగుతుందనేది ఫిలింనగర్ టాక్. అంతేకాకుండా ఈ సినిమాకు శేషాచలం అనే టైటిల్‌ను వర్కింగ్ టైటిల్‌గా పెట్టుకొన్నట్టు తెలిసింది.

యాస, భాషను పట్టుకొనేందుకు
అయితే ఈ కథలో తన పాత్రకు అనుగుణంగా అల్లు అర్జున్ ప్రిపేర్ అవుతున్నారట. చిత్తూరు యాస, భాషను ఒడిసి పట్టుకొనేందుకు స్పెషల్‌గా ట్రైనింగ్ తీసుకొంటారనేది ఇన్‌సైడ్ టాక్. అంతేకాకుండా బాడీ లాంగ్వేజ్‌ను కూడా తగినట్టుగా మార్చుకొంటున్నారట. తెరపైన శేషాచలం మాత్రమే కనిపించేలా చర్యలు తీసుకొవడంలో స్టైలిష్ స్టార్ నిమగ్నమయ్యారని చెప్పుకొంటున్నారు.
Recommended Video


శేషాచలం టైటిల్‌తోనే ముందుకు
ఇక టైటిల్ విషయంలో చిత్ర యూనిట్‌లో భారీగానే చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. శేషాచలం టైటిల్‌ను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. కథకు శేషాచలం అడవులు యాప్ట్ కావడం, అలాగే ప్రజల్లో నానిన పేరు కావడంతో ఇదే కొనసాగిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ అనుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











