twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అడవి శేష్’ పంజాలో ఎంత నీచుడంటే...!

    By Bojja Kumar
    |

    ఆ మధ్య వచ్చిన కర్మ సినిమా ద్వారా యాక్టర్ గా, డైరెక్టర్ గా తెలుగు సినిమారంగంలోకి ఎంటరైన అడవి శేష్...పంజా సినిమాలో నెగెటివ్ రోల్ పోషించాడు. ఇందులో అడవి శేష్ పాత్ర పేరు మున్నా. మెయిన్ విలన్ భగవాన్(జాకీ ష్రాఫ్) ముద్దుల కుమారుడు. డ్రగ్స్ కు బానిస. అమ్మాయిల పిచ్చి. తన తండ్రి వద్ద ఉండే సభాపతి(పుచూరి), గురు(తనికెళ్ల భరణి), జై(పవన్) లాంటి వాళ్లను చాలా చులకనగా చూస్తూ ఉంటాడు. ఒక సారి సభాపతిపై మాత్రం పోయడం లాంటి నీచమైన పనులు చేస్తూ ఉంటాడు. కొడుకు ఎన్ని నీచమైన పనులు చేసినా భగవాన్ అస్సలు పట్టించుకోడు.

    దీంతో సభాపతి భగవాన్ అపోజిట్ గ్యాంగ్ అతుల్ కులకర్ణితో చేతులు కలుపుతాడు. దీంతో సభాపతిని చంపేయమని జైని ఆదేశిస్తాడు భగవాన్. అతన్ని చంపడానికి కాస్త వెనకా ముందు ఆలోంచిన జై...చాలా కాలం మనతో పని చేశాడు కదా, నేను మాట్లాడి తీసుకొస్తా అని భగవాన్ ను ఒప్పిస్తాడు. అయితే అతుల్ కులకర్ణి గ్యాంగ్ దగ్గరికి వెళ్లడం అంత సులభం కాదు. ఇందుకోసం ఆ గ్యాంగ్ లోని ముఖ్యవ్యక్తి కొడుకుని కిడ్నాప్ చేసి అక్కడికి వెళాడు. జై అలా వెళ్లగానే ఆ పిల్లాన్ని చంపేస్తాడు మున్నా. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. ఎలాగో అలా వారి అటాక్ నుంచి జై బయట పడతాడు.

    ఎప్పుడూ జై తోనే ఉండే బార్ గర్ల్ జాహ్నవి(అంజలి లవానియా)పై కన్నేస్తాడు మున్నా. ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలం అవుతాడు. ఆమె ఎప్పుడూ పవన్ ఇంట్లోనే ఉంటుందని గురు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన మున్నా ఆమెను కొట్టి చంపేస్తాడు. ఈ క్రమంలో జై చేతిలో హతం అవుతాడు మున్నా. ఇదీ అడవి శేష్ పాత్ర గురించి బ్రీఫ్ గా....

    English summary
    Jackie Shroff as a gangster justified his selection. Tanikella Bharani, Paruchuri Venkateswara Rao acted in less important roles. Atul Kularni is wasted in the movie. Seshu Adavi as young villain is noisy. Subba Raju and Jhansi restricted to couple of scenes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X