twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా పేరు సూర్య ఆడియో: అల్లు అర్జున్ యువసేన భారీ ర్యాలీ... (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక నేటి సాయంత్రం (ఏప్రిల్‌ 22) మిలటరీ మాధవరంలో జరుగనుంది. ఈ మేరకు అక్కడ అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

    భారీ హోర్డింగులు

    భారీ హోర్డింగులు

    నా పేరు సూర్య ఆడియో వేడుక జరిగే మిలటరీ మాధవరం గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం నుండి 12 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు.

    గోదావరి జిల్లాల్లో సందడి

    గోదావరి జిల్లాల్లో సందడి

    తొలిసారిగా ఆడియో వేడుక తమ ప్రాంతాల్లో జరుగుతుండటంతో గోదావరి జిల్లాల్లోని మెగా అభిమానుల్లో సందడి నెలకొంది. తమ అభిమానాన్ని చాటుకుంటూ ఆయా ప్రాంతాల్లో భారీ బేనర్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

     అల్లు అర్జున యువసేన భారీ ర్యాలీ

    అల్లు అర్జున యువసేన భారీ ర్యాలీ

    తూ.గో, ప.గో జిల్లాల్లోని అల్లు అర్జున్ అభిమానులు ఆయా ప్రాంతాల నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ మిలటరీ మాధవరం చేరుకోనున్నారు. ఈ మేరకు అల్లు అర్జున్ యువ సేన పేరుతో జెండాలు కూడా సిద్ధం చేసుకున్నారు.

     వేడుకకు అంతా సిద్దం

    వేడుకకు అంతా సిద్దం

    మిలట్రీ మాధ వరంలో ‘నా పేరు సూర్య' ఆడియో వేడుకకు అంతా సిద్ధమైంది. శనివారం నుండే ఆడియో వేడుక స్టేజీని సిద్ధం చేసే పనులు మొదలయ్యాయి. భారీగా సంఖ్యలో తరలి వచ్చే అభిమానులను దృష్టిలో పెట్టుకుని అందుకు తగిన విధంగా ఏర్పాటు చేస్తున్నారు.

    అందుకే ఇక్కడ ఆడియో వేడుక

    అందుకే ఇక్కడ ఆడియో వేడుక

    బ్రిటీష్ పాలనలోనే ఈ గ్రామం నుంచి అనేక మంది యువత సైన్యంలో ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. అందులో కొందరు అమరులయ్యారు. ఈ గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా సైన్యంలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. అందుకే మిలటరీ మాధవరం పేరు సార్థకనామధేయంగా మిగిలింది. అలాంటి వీర సైనికుల నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. అందుకే ఈ చిత్ర ఆడియో వేడుక ఇక్కడ నిర్వహిస్తున్నారు.

    సైనికుల త్యాగాల్ని మరోసారి గుర్తు చేసుకునేలా

    సైనికుల త్యాగాల్ని మరోసారి గుర్తు చేసుకునేలా

    సైనికుల త్యాగాల్ని మరోసారి గుర్తు చేసుకునేలా... వారిని గౌరవించుకునేలా... నా పేరు సూర్య కార్యక్రమం ఉండబోతుంది. అల్లు అర్జున్ తో పాటు చిత్ర యూనిట్ అంతా ఈ ఆడ‌యో ఫంక్షన్ లో పాల్గొనబోతున్నారు.

    సైనిక కుటుంబాలను కలవనున్న బన్నీ

    సైనిక కుటుంబాలను కలవనున్న బన్నీ

    ఈ ఊరు గురించి తెలుసుకున్న వెంట‌నే మా యూనిట్ అక్క‌డికి వెళ్ళి అక్క‌డ ప్ర‌జ‌ల్ని క‌ల‌వ‌టం జ‌రిగింది. దేశ భ‌క్తి నేప‌ధ్యంలో తీస్తున్న ఈ చిత్రం కాబ‌ట్టి ఒక్క‌సారి అక్క‌డికి వెళ్ళి రావాల‌ని అంద‌రం అనుకున్నాం. ఇక్కడ ఆడియో వేడుక నిర్వహించడంపై హీరో అల్లు అర్జున్ కూడా ఆనందంతో ఉననారు. ఆడియో విడుదల ముందు అక్క‌డ కొన్ని కుటుంబాల్నిబ‌న్ని క‌లుసుకుంటారు. వారి స‌మ‌క్షంలొనే ఆడియోక జరకుగుతుందని నిర్మాతలు తెలిపారు.

     హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్

    హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్

    మిల‌ట‌రి మాధ‌వ‌రం ఆడియో ఫంక్ష‌న్ అనంతరం ఏప్రిల్‌ 29 న ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో నిర్వహించనుననారు. మే 4 న సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

    English summary
    Allu Arjun's 'Naa Peru Surya Naa Illu India' has wrapped shooting and is gearing up for a worldwide release on May 4. The film's team is planning to have its audio release event Today(April 22) at Military Madhavaram, West Godavari.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X