For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అందాలతో అరాచకం...: ప్రియాంక చోప్రాని మీరు ఎప్పుడూ ఇలా చూసి ఉండరు

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రియాంకచోప్రా ఇంతకు ముందు కేవలం బాలీవుడ్ కే పరిమితం. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి మాత్రమే ఆమె పేరు సుపరిచితం. ఇప్పుడు సీన్ మారింది. ఇంటర్నేషన్ మార్కెట్లో సైతం ఆమె పేరు మారు మ్రోగుతోంది. అంతెందుకు మన తెలుగు వారికి సైతం ఆమె రామ్ చరణ్ హీరోయిన్ గా తెలుసు.

  బాలీవుడ్ హాట్ టాప్ అందాల ఈ హీరోయిన్...ఎంతగా ముందుకు దూసుకుపోతున్నా తనని ఈ స్దాయికి తెచ్చిన ఫొటో షూట్ ల ను మ్యాగజైన్ లను మాత్రం మరవటం లేదు. అవకాసం దొరికినప్పుడల్లా తనలోని సెక్సీ కోషియంట్ పై మనందరి దృష్టీ పడేలా ఫొటో షూట్ కు రెడీ అయ్యిపోతోంది.

  తాజాగా ఆమె ఎమ్మి, కాంప్లెక్స్ మ్యాగజైన్స్ కోసం ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటో షూట్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. బాలీవుడ్ దర్శక,నిర్మాతలు అయితే ఎంత ఖర్చైనా సరే ఆమె చేత మళ్లీ హిందీ సినిమాల్లో చేయించాలని ఫిక్స్ అవుతున్నారు.

  మరో ప్రక్క ఈ అందాల ఫొటో షూట్ లతో తోటి హిరోయిన్స్ కు నిద్రపట్టనివ్వకూడా చేస్తోంది. వారికి ఓ రేంజిలో సవాల్ విసురుతోంది. హాలీవుడ్ వెళ్లిపోతోంది. ఇంగ్లీష్ టీవి సీరియల్స్ చేసుకుంటోంది అని సంబరపడుతున్నవారికి ఆ ఆనందం దక్కనిచ్చేటట్లు కనపడటం లేదు. అసలు ఆమె సక్సెస్ అంతా వయస్సుతో పాటు అందం పెరగటంలోనే అంటున్నారు బాలీవుడ్ జనం.

  స్లైడ్ షోలో ఆ ఫొటో షూట్ ఫొటోలు చూసేయండి మరి..

  జూన్ కవర్ పేజీ

  జూన్ కవర్ పేజీ

  ఈ ఫొటో షూట్ ఫొటోలు జూన్ నెల కాంప్లెక్స్ సంచికపై రానున్నాయి.

  స్టీరియోటైప్ వద్దు

  స్టీరియోటైప్ వద్దు

  ఈ మ్యాగజైన్ లో ఆమె మాట్లాడుతూ నేను భారతీయులు కోరుకునే స్టీరియో టైప్ పాత్రలు చేయటానికి ఇష్టపడను. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలో వచ్చే హీరోయిన్ పాత్ర తరహావి అంటూ తెగేసి చెప్పింది.

  నాకంటూ

  నాకంటూ

  ఎవరి అబిప్రాయాలకు అణుగుణంగా నేను పనిచేయను. నా సొంత అబిప్రాయాలు,ఆలోచనలతోనే నేను పెరిగే అలాగే ఉంటాను

  సందడి

  సందడి


  బాలీవుడ్‌ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో బాగానే సందడి చేస్తోంది.

  షూటింగ్ పూర్తైంది

  షూటింగ్ పూర్తైంది

  ఆమె నటిస్తున్న హాలీవుడ్‌ చిత్రం ‘బేవాచ్‌'లో ఆమె పాత్ర చిత్రీకరణ పూర్తయింది.

  అవార్డ్ ల వేడుకలో

  అవార్డ్ ల వేడుకలో

  తాజాగా లాస్‌ ఎంజిలెస్‌లో జరిగిన బిల్‌బోర్డ్‌ మ్యూజిక్‌ అవార్డుల వేడుకలో పాల్గొంది ప్రియాంక. నీలిరంగు డ్రెస్‌లో ప్రియాంక హాట్‌గానే కనిపించింది.

  మేఘన్ ట్రైనర్

  మేఘన్ ట్రైనర్

  ఈ వేడుకలో పాల్గొన్న హలీవుడ్‌ గాయని మేఘన్‌ ట్రైనర్‌ అంటే తనకు ఇష్టమని చెప్పింది ప్రియాంక. మేఘన్‌తో కలిసి తీయించుకున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది ప్రియాంక

  విలన్ గా

  విలన్ గా

  ప్రియాంకా చోప్రా బేవాచ్ లో విలన్ గా నటించనుంది.

  సెక్సీ విలన్ గా..

  సెక్సీ విలన్ గా..

  క్వాంటికో సీరియల్‌తో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన బాలీవుడ్ బ్యూటీ హాలీవుడ్ స్టార్ డ్వేయిన్ జాన్సన్ నటిస్తున్న బేవాచ్ మూవీలో సెక్సీ విలన్ రోల్ గా చేసింది..

  ఆయిల్ టైకూన్

  ఆయిల్ టైకూన్

  33 ఏళ్ల చోప్రా ఆ మూవీలో ఆయిల్ టైకూన్ విక్టోరియా లీడ్స్ పాత్రను పోషించనుంది.

  ఆ సీరియల్ నే

  ఆ సీరియల్ నే

  90వ దశకంలో టీవీల్లో పాపులర్ షోగా ప్రసారమైన బేవాచ్‌ను ఇప్పుడు సినిమాగా రూపొందిస్తున్నారు.

  రిలీజ్ ఎప్పుడంటే

  రిలీజ్ ఎప్పుడంటే

  2017 మే నెలలో బేవాచ్‌ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సేత్ గార్డన్ దర్శకుడు.

  మూడు సార్లు

  మూడు సార్లు

  ప్రియాంక చోప్రా 2002లో 3 సార్లు ఆత్మహత్యకు యత్నించిందని ఆమె మాజీ మేనేజర్ ప్రకాష్ జజూ ట్విటర్‌లో తెలిపాడు. ఆ ట్వీట్లు సంచలనం సృష్టించాయి.

  ఇబ్బందులు

  ఇబ్బందులు

  2002లో ప్రియాంక చోప్రా ప్రేమ వ్యవహారం వల్ల చాలా ఇబ్బందులు పడిందని... కొన్నాళ్లకు ఆమె ప్రియుడు అసీమ్ తల్లి చనిపోయిందని ట్వీట్ చేశాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ప్రియాంక ఆత్మహత్యకు యత్నించిందని చెప్పాడు.

  శృంగార దేవత

  శృంగార దేవత

  టీవీ సీరియల్‌తో అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా..
  ఆసియా శృంగార దేవతగా ఎంపికైంది.

  ఈ గ్రహం మీదే

  ఈ గ్రహం మీదే

  ఈ భూగ్రహం మీద ఉన్న 50 మంది సెక్సీయెస్ట్ ఆసియా మహిళలుః అంటూ ఓ బ్రిటన్‌కు చెందిన ఈస్ట్రన్ ఐ అనే పత్రిక ఒక జాబితా రూపొందించగా.. అందులో ప్రియాంక అగ్రస్థానంలో నిలిచింది.

  ఫ్యామిలీ..

  ఫ్యామిలీ..

  మా నాన్న పంజాబీ, అమ్మ బీహారీ. నేను పుట్టింది జార్ఖండ్‌లో. పెరిగింది ఎక్కడంటే ఏం చెప్పను! ఒక్కచోటని కాదు.. లక్నో, రాయ్‌బరేలీ, అమెరికా, ముంబయి.. ఇలా చదువు కోసం దేశవిదేశాల్లో తిరిగాను.

  నాన్నకు ఇష్టం...

  నాన్నకు ఇష్టం...

  నాన్న సైన్యంలో వైద్యుడిగా సేవలందించారు. ఆయన ఉద్యోగరీత్యా చాలా చోట్ల తిరిగి చదువుకోవాల్సి వచ్చింది. అమ్మాయిలకి నాన్నంటే అభిమానం ఎక్కువంటారు కదా! ఇది నా విషయంలోనూ నిజమే.

  గారం..క్రమశిక్షణ

  గారం..క్రమశిక్షణ

  చిన్నప్పుడు నేను ఆస్తమాతో తెగ బాధపడేదాన్ని. దాంతో నాన్న నిరంతరం నన్ను కనిపెట్టుకొని ఉండేవారు. అలా ఆయనే లోకంగా పెరిగాను. అలాగని గారాబం డాట్‌కామ్‌ అనుకునేరు. నన్నూ తమ్ముణ్నీ కఠిన క్రమశిక్షణతోనే పెంచారు.

  అమెరికాలో చదువుకున్నా

  అమెరికాలో చదువుకున్నా

  అమెరికాలో బంధువులింట్లో ఉండి చదువుకొన్నప్పుడు ఖర్చులకు వారానికి పది డాలర్లు ఇచ్చే వారు. అది ఏ మూలకూ సరిపోయేది కాదు. కొత్త ఫ్యాషన్లు కంటపడేవి. కానీ వాటి జోలికి వెళ్లే పరిస్థితి ఉండేది కాదు.

  సిగ్గరిని

  సిగ్గరిని

  స్కూలు రోజుల నుంచీ నేను కాస్త సిగ్గరిననే చెప్పాలి. అంటే నాలో నేను తరహా. మరీ బాధ కలిగితే ఎవరూ చూడకుండా ఏడ్చేదాన్ని. ఇంకా బాధనిపిస్తే మనసు లోతులని వెతుకుతూ కవిత్వం రాసేదాన్ని. చిన్న కథలూ కవితలూ చాలానే రాశాను. కానీ పోటీలకు పంపలేదు. ఎవరికీ చదివి వినిపించలేదు.

  English summary
  Check out Priyanka Chopra's latest photoshoots for 'Emmy' and 'Complex'. And guys, before going through the slides, let us tell you that it is probably the most hottest thing on the Internet today!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X