twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నాహజారే స్ఫూర్తితో హీరో శ్రీకాంత్

    By Srikanya
    |

    అన్నాహజారే స్ఫూర్తితో హీరో శ్రీకాంత్ క్యారక్టైరేజన్ నడుస్తుంది..గాంధీ, అన్నా హజారే స్ఫూర్తిగా తెరకెక్కిన చిత్రం 'సేవకుడు'. ఈ చిత్రం అవినీతికి పాల్పడే రాజకీయనాయకులకు గొడ్డలిపెట్టు. దేశం కోసం, సమాజ శ్రేయస్సుకోసం పాటు పడేవాడే 'సేవకుడు'. మనిషి, సమాజం మారాలని చెప్పే చిత్రం ఇది. ప్రస్తుతం రాజకీయనాయకుల అవినీతి ఏ స్థాయిలో ఉందో ఈ సినిమాలో చూపిస్తున్నాం. శ్రీకాంత్ ఉద్వేగభరితమైన పాత్రలో ఎంతో చక్కగా నటించారు. రాజకీయం అంటే కేవలం డబ్బు సంపాదించడానికో మార్గం అని చాలామంది నాయకుల ఉద్దేశం. మన దేశంలోని వనరులతో ఉన్నతస్థాయికెళ్లి విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇలాంటి సామాజిక సమస్యలపై పోరాటం చేసిన ఓ యువకుడి కథే మా చిత్రం. నేను నిర్మాత శ్రేయస్సును కోరి సినిమాలు తీస్తా అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు సముద్ర.

    ఆయన తాజా చిత్రం 'సేవకుడు'ఆడియో విడుదల సందర్భంగా ఆయన ఇలా మాట్లాడారు. శ్రీ వెంకటరమణ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్, చార్మి జంటగా వి.సముద్ర దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'సేవకుడు'. ఇక ఈ చిత్రం గురించి హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ..."ఈ సినిమా నాకు మంచి పేరు తెస్తుంది. ఇందులో నాకు పవర్‌ఫుల్ డైలాగులున్నాయి. సముద్ర మంచి మాస్ డైరెక్టర్. లవ్, యాక్షన్‌ని ఎంతో చక్కగా తెరకెక్కించాడు.ఎప్పుడెప్పుడు చూద్దామని ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నా. ఈ చిత్రంలో పాటలన్నీ బాగున్నాయి. ఈ చిత్రానికి ఆర్ఆర్ బాగా కుదిరింది'' అన్నారు. ఈ చిత్రంలో హీరో కృష్ణ ప్రత్యేక పాత్రలో నటించారు.

    English summary
    Director Samudra Says...Sevakudu movie inspired from Anna Hazare's movement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X