twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రోబో' రికార్డు బ్రద్దలు కొడుతుందంటున్నారు

    By Srikanya
    |

    రజనీకాంత్ రోబో కలెక్షన్స్ పరంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ కలెక్షన్స్ ఇండస్ట్రీలో ఓ రికార్డు. ఆ రికార్డును ఇప్పుడు సూర్య తాజా చిత్రం సెవెంత్ సెన్స్ దాటేస్తుందని చెప్తున్నారు. గతంలో శివపుత్రుడు, అపరిచితుడు, పోతురాజు వంటి చిత్రాలను తెలుగులో అనువాదం చేసిన సుబ్రహ్మణ్యం లేటెస్ట్‌గా 'సెవెన్త్‌సెన్స్‌' విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం గురించి శనివారం ఆయన మాట్లాడుతూ...'రోబో ఎంతటి సెన్సేషనల్‌ క్రియేట్‌ చేసిందో అంతకంటే పదిరెట్లు క్రేజ్‌ ఏర్పడింది. సినిమారంగం ప్రయోగానికి కొత్తకాదు. క్రియేటివిటీ ఉంటేనే ఇక్కడ రాణిస్తారు. అలాంటి సృజనాత్మక అంశాలు దండిగా ఉన్న దర్శకుడు మురుగదాస్‌. ఆయన చేసిన చిత్రాలు తెలుగులో విడుదలయ్యాయి. ఆ కోవలో ఇదీ ఉంటుంది. కథకు సరైన హీరో సూర్య. ఆయన పాత్రే చిత్రానికి హైలైట్‌. కళ్ళతోనే అన్ని భావాలూ పలికిస్తాడు. బాడీ లాంగ్వేజ్‌ వెరైటీగా ఉంటుంది. ఇకపోతే హీరోయిన్‌ శృతిహాసన్‌ నటనతోపాటు గ్లామర్‌ కురుపిస్తుంది' అని చెప్పారు.అలాగే కథ గురించి మాట్లాడుతూ...మనిషి జీవితంలో సిక్త్‌సెన్స్‌ అనుభవం ఒక్కసారైనా ఎదురవుతుంది. జరగబోయే ఒక విషయం గురించి, సంఘటన గురించి ముందుగా మనం తెలుసుకోవటమే సిక్త్‌సెన్స్‌. మరి ఈ ఏడోసెన్స్‌ ఏంటి ! నటుడు సూర్య, దర్శకుడు మురుగదాస్‌లే ఈ విషయాన్ని చెప్పాలి. వారి తీసిన 'సెవెన్త్‌ సెన్స్‌' సినిమా విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇందులోని అసలు కథ దర్శకుడు మురుగదాస్‌కే తెలుసునని నిర్మాత సుబ్రహ్మణ్యం అంటున్నాడు. శ్రీలక్ష్మీగణపతి ఫిలింస్‌పై ఈ చిత్రాన్ని తెలుగులో ఆయన విడుదల చేస్తున్నారు. సంగీతం గురించి మాట్లాడుతూ... 'హరీష్‌జైరాజ్‌ అద్బుతంగా ఇచ్చాడు. కథ రీత్యా దశబ్దాలనాటిది. కనుక దాని గురించి తగ్గట్లుగానే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అదరకొట్టాడు' అని అన్నారు. ఇప్పటికే ఈచిత్రం బిజినెస్‌ అయిపోయిందని తెలిపారు. ఈనెల 26న విడుదల కానుంది.

    English summary
    Subrahmaniam B and Rupesh are producing ‘Seventh Sense’ movie in Telugu which is slated for Deepavali release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X