హీరోయిన్ల పేర్లు, రూమ్ నెంబర్లు.... ఆ కాగితమే సెక్స్ రాకెట్ పట్టించింది!

By Bojja Kumar

Recommended Video

మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతుల ఇంట్లో భారీ ఎత్తున కండోమ్స్

అమెరికాలోని చికాగో కేంద్రంగా తెలుగు దంపతులు నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వీరు దొరికిపోవడానికి కారణం ఓ చిన్న కాగితమే అని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అందులో ఉన్న వివరాల ఆధారంగా కూపీ లాగడంతో డొంకంతా కదిలింది. ఆ డిటేల్స్ ఆధారంగానే తెలుగు సినీ నిర్మాత మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతుల ఇంట్లో సోదాలు నిర్వహించగా ఈ వ్యభిచార దందా బట్టబయలైంది.

పోలీసులు ఎలా ఎంటరయ్యారు?

పోలీసులు ఎలా ఎంటరయ్యారు?

ఈ ఏడాది జనవరిలో కిషన్ దంపతులను యునైటెడ్ స్టేట్స్ బోర్డర్ పెట్రోల్ సిబ్బంది వీరిని అరెస్టు చేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారనే ఆరోపణలపై వారిని అరెస్టు చేయగా ఫిబ్రవరి 23న బయటకు వచ్చారు. ఇద్దరినీ అరెస్ట్ చేసిన సమయంలో వారి నుంచి అధికారులు కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకోగా... అందులో మారియట్ హోటల్ లెటర్ హెడ్‌తో ఉన్న పేపర్లో ఉన్న వివరాలు పోలీసుల్లో అనుమానం రేకెత్తించింది.

ఆ పేపర్లో ఏముంది?

ఆ పేపర్లో ఏముంది?

మారియట్ హోటల్ లెటర్ హెడ్‌తో ఉన్న ఆ పేపర్లో పలువురు హీరోయిన్ల పేర్లు, వారు ఏ తేదీల్లో అందుబాటులో ఉంటారు, ఏ రూములో ఉంటారు అనే విషయాలన్నీ ఉన్నాయి. అనుమానంతో పోలీసులు మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ జరిపారు.

సోదాలు చేయడంతో విషయం బట్టబయలు

సోదాలు చేయడంతో విషయం బట్టబయలు

ఈ దంపతులు వ్యభిచార దందా నిర్వహిస్తున్నారనే అనుమానంతో కోర్టు అనుమతి తీసుకుని వారు నివాసం ఉంటున్న ఇంట్లో సోదాలు జరుపగా.... అసలు విషయం బయట పడింది. భారీ ఎత్తున కండోమ్స్ లభించడం అమెరికా పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది.

ఫేక్ లెటర్ హెడ్స్

ఫేక్ లెటర్ హెడ్స్


కిషన్ దంపతులు హీరోయిన్లను అమెరికా రప్పించేందుకు అమెరికా తెలుగు సంఘాల పేరుతో ఫేక్ లెటర్ హెడ్స్ సైతం క్రియేట్ చేసినట్లు తేలింది. ఈ విషయం తెలిసి అమెరికా తెలుగు సంఘాల ప్రతినిధులు సైతం షాకవుతున్నారు. వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

ఇల్లినాయిస్ కోర్టుకు కిషన్ దంపతులు

ఇల్లినాయిస్ కోర్టుకు కిషన్ దంపతులు

ఈ కేసుకు సంబంధించి కిషన్ దంపతులను ఇల్లినాయిస్ కోర్టులో ప్రవేశ పెట్టారు. వివిధ కోణాల్లో కేసును పరిశోధిస్తున్న పోలీసులు వారి ఫోన్ డాటాను విశ్లేషిస్తున్నారు. దీంతో పాటు ఇందులో సాక్షులను కూడా ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

అమెరికా వెళుతున్న తెలుగు హీరోయిన్లకు తిప్పలు

అమెరికా వెళుతున్న తెలుగు హీరోయిన్లకు తిప్పలు

ఈ సెక్స్ రాకెట్ ఎఫెక్టుతో అమెరికాలో అడుగు పెడుతున్న తెలుగు హీరోయిన్లు తిప్పలు పడుతున్నారు. ఎయిర్ పోర్టులోనే అధికారులు వారిని నిలిపి వేసి గంటల తరబడి విచారిస్తున్నారు. ఇటీవల హీరోయిన్ మెహ్రీన్ కౌర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. పోలీసులకు విచారించే వరకు తనకు సెక్స్ రాకెట్ గురించి తెలియదని, ఇలా అయితే తరచూ అమెరికా వెళ్లే తమ లాంటి వారికి ఇబ్బందులు తప్పవని ఆమె వాపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X