స్టార్ హొటల్‌లో సినీ తారల వ్యభిచారం.. పోలీసులు అరెస్ట్.. ఇద్దరు సినీతారల అరెస్ట్.. వారు ఎవరంటే..
హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో వ్యభిచారం చేస్తున్న సినీ నటి, ఆమె సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. పక్కా సమాచారం ఆధారంతోనే మేము దాడి చేశాం. దాడుల్లో సినీ నటి రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది అని నగర పోలీసులు తెలిపారు.

ప్రముఖ హోటల్‌లో వ్యభిచారం
బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 1లోని హోటల్ తాజ్ డెక్కన్‌లో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందింది. ధనవంతుల బిడ్డలను ఆకర్షిస్తూ రాత్రికి రూ.లక్ష, ఆ పైన డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది అని పోలీసులు తెలిపారు.

రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్
శనివారం రాత్రి నిఘా పెట్టి హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్న గదిపై దాడి చేశాం. సినీ నటిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నాం. ఆమెకు సహకరిస్తున్న మోనీష్ కడాకియాతో పాటు హోటల్ మేనేజర్‌ను అరెస్టు చేశాం అని దీంతో నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.

ముంబై నుంచి వచ్చి
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం ముంబై నుంచి సినీనటి హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలిసింది. ప్రముఖ హోటల్‌లో బస చేసి వ్యభిచారం నడుపుతున్నట్టు పక్కా సమాచారం అందింది. ఆ మేరకు దాడి చేశాం అని పోలీసులు పేర్కొన్నారు.

బెంగాలీ సినీతార అరెస్ట్
నిందితుడు మనీష్‌ను విచారిస్తున్నాం. ఈ సెక్స్ రాకెట్ వెనుక ఎవరు ఉన్నారు అనే కోణంలో విచారిస్తున్నాం. ఇదిలా ఉండగా, మరో హోటల్‌పై జరిపిన దాడిలో మరో సినీనటి కూడా అరెస్ట్ అయింది. ఆమెను బెంగాలీ సినీ నటిగా గుర్తించారు.


Click it and Unblock the Notifications











