హీరోయిన్ అరెస్ట్‌తో.. యూఎస్ సెక్స్ దందా గుట్టురట్టు.. 70కిపైగా సినీతారలు!
టాలీవుడ్ పరిశ్రమనే కాకుండా కన్నడ సినీ పరిశ్రమను షికాగో సెక్స్ రాకెట్ ఉదంతం కుదిపేస్తున్నది. టాలీవుడ్‌లో పలు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన మోదుగుమూడి కిషన్, ఆయన భార్య చంద్రకళ అరెస్ట్‌తో ఈ వ్యవహరం సంచలనం రేపింది. పలువురు హీరోయిన్లతో వ్యభిచారం చేయిస్తున్నారనే ఆరోపణలపై ఈ ఇద్దరిని ఏప్రిల్ చివరి వారంలో అమెరికా ఫెడరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా రెండు రోజుల క్రితం ఈ వార్త బయటకు రావడంతో తెలుగు పరిశ్రమ ఉలిక్కిపడింది.

సెక్స్ రాకెట్ వెలుగు చూసిందిలా..
కాలిఫోర్నియా నగరంలోదక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం (టీఏఎస్‌సీ) నిర్వహించే స్టార్‌నైట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఓ హీరోయిన్ గతేడాది నవంబర్ 8న అమెరికాకు వెళ్లింది. కార్యక్రమం ముగిసిన తర్వాత అమెరికాకు వచ్చిన ఆమె కాలిఫోర్నియాకు కాకుండా షికాగోకు వెళ్లింది. దాంతో హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులకు అనుమానం వచ్చింది.

ఫెడరల్‌లో ఉచ్చులో సినీతార
సదరు హీరోయిన్ కదలికపై ఫెడరల్ అధికారులు దృష్టిపెట్టారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. సదరు హీరోయిన్ చెప్పిన విషయాలపై లోతైన దర్యాప్తు చేయడంతో ఈ సెక్స్ దందా గుట్టురట్టయింది.

ఫిబ్రవరి నెలలోనే వారెంట్
టాలీవుడ్ హీరోయిన్ల సెక్స్ దందా ఫెడరల్ దృష్టికి రావడంతో కిషన్ దంపతుల వ్యవహారాలపై దృష్టిపెట్టారు. 2018 ఫిబ్రవరి 16వ తేదీని వారి ఆచూకీ కోసం, షికాగోలోని వారి నివాసంలో సోదాలు నిర్వహించేందుకు సర్చ్ వారెంట్ జారీ చేశారు. పోలీసుల సోదాల్లో 70 కండోమ్స్ ప్యాకెట్స్‌తోపాటు కీలక సమాచారం లభ్యమైంది.

సోదాల్లో కీలక సమాచారం
హీరోయిన్లతో వ్యభిచారం చేయించినందుకు క్లయింట్స్ నుంచి సుమారు 70 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్టు షికాగో ట్రిబ్యూన్ మీడియా తన కథనంలో పేర్కొన్నది. కిషన్ భార్య మెయింటెన్ చేసే రిజిస్టర్లలో పలువురు హీరోయిన్ల పేర్లు, వారి వ్యభిచార కార్యక్రమాల చిట్టాకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి.

42 పేజీల చార్జిషీట్
సెక్స్ రాకెట్ కుంభకోణంలో కిషన్ దంపతులను ఏప్రిల్ చివరివారంలోనే అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వ్యవహారం బుధవారం అమెరికాలోని స్థానిక మీడియా కథనాలు వెల్లడించడంతో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సెక్స్ కుంభకోణంలో కిషన్ దంపతులపై ఫెడరల్ పోలీసులు 42 పేజీల చార్జిషీట్‌ను చికాగో డిస్ట్రిక్ట్ కోర్టు దాఖలు చేసింది.

76 మంది హీరోయిన్లు
ఫెడరల్ పోలీసుల విచారణలో కిషన్, చంద్రకళ దంపతులు అనేక అక్రమాలకు పాల్పడినట్టు వెల్లడైంది. హీరోయిన్లను, మోడల్స్, యాంకర్లను బీ1, బీ2, విజిటింగ్ వీసాలపై అమెరికాకు తీసుకెళ్లేవారు. ఈ దందా కోసం 2016 నవంబర్ 8 నుంచి 2017 నవంబర్ 29 మధ్యకాలంలో నిందితులు 76 విమాన టికెట్లను కొనుగోలు చేశారు.

కన్నడ పరిశ్రమకు లింకు
కాగా సెక్స్‌రాకెట్ వ్యవహారంలో కన్నడ హీరోయిన్ల పేర్లు కూడా వెలుగు చూసినట్టు సమాచారం. కొందరు కన్నడ సినీ తారలను కూడా కిషన్ దంపతులు అమెరికాకు తరలించినట్టు విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. అమెరికాలోని తెలుగు సంఘాలు నిర్వహించే పలు కార్యక్రమాలకు టాలీవుడ్, శాండల్‌వుడ్ నుంచి పలువురు నటులు, సినీనేపథ్యం ఉన్నవారు తరచూ వెళ్తుండటంతో ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











