సర్వే: సెక్సియెస్ట్ హీరో అతనే...!
ముంబై: అతని బాడీ చూసి అమ్మాయిలు పిచ్చెక్కిపోతారు... అతని చూపులు గాల్స్ గుండెల్లో మన్మథ బాణాల్లా గుచ్చుకుంటాయి. ఇక అబ్బాయిలు అతన్ని చూస్తే జలసీ ఫీలవుతారు. అతనే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. కండలు తిరిగిన పర్ ఫెక్ట్ బాడీ, చూడచక్కని రూపం అతని సొంతం. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న హృతిక్ తాజాగా ఆసియాలోనే సెక్సియెస్ట్ మగాడిగా కిరీటం దక్కించుకున్నాడు. ఓ ఆన్ లైన్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
లండన్ నుంచి వెలువడే ఓ వీక్లీ మేగజైన్ ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 38 ఏళ్ల హృతిక్.... షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, రణబీర్ కపూర్లను వెనక్కి తోసి టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఈ సర్వేలో హృతిక్ రోషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా గతేడాది సర్వేతో పోలిస్తే అత్యధిక ఓట్లు పడ్డాయి.
ఈ సర్వేపై హృతిక్ రోషన్ స్పందిస్తూ... 'పబ్లిక్ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. అదే విధంగా నన్ను నేను సెక్సీగా పోల్చుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉంది. అయితే ఇతరుల కంటే నాకు బెస్ట్ ప్లేస్ దక్కడం ఆనందంగా ఉంది. ఈ సర్వేలో పాల్గొని నన్ను మరింత ఎంకరేజ్ చేస్తున్న వారికి థాంక్స్' అని వ్యాఖ్యానించారు.
ఇటీవల అగ్నిపథ్ సినిమాతో హిట్ కొట్టిన హృతిక్ రోషన్... ప్రస్తుతం క్రిష్-3 చిత్రంలో నటించడంతో పాటు, మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. ఇందులో ఒకటి 'నైడ్ అండ్ డే రీమేక్' కాగా, రెండో ది శేఖర్ కపూర్ దర్శకత్వంలో రానున్న 'పాని' చిత్రం. 'పాని' చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











