సెక్సియెస్ట్ టాప్-5లో.....రామ్ చరణ్
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ టాప్ 5 సెక్సియెస్ట్ యాక్టర్లలో చోటు దక్కించుకున్నాడు. ఇండియాలోని యంగ్ హీరోల్లో సెక్సియెస్ట్ స్టార్ ఎవరు? అనే అంశంపై స్టార్ ఇండియా గ్రూపు నిర్వహించిన సర్వేలో ఆయనకు 5వ స్థానం దక్కింది. దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించిన ఈ ఫలితాలు వెల్లడించారు.
బాలీవుడ్ స్టార్ హీరోలు, సీనియర్ హీరోలైన షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి వాళ్లకు ఈ లిస్టులో చోటు దక్కక పోవడం గమనార్హం. రామ్ చరణ్ ఇప్పటి వరకు నటించిన ఒక్కగానొక్క బాలీవుడ్ మూవీ 'జంజీర్' ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నా....అక్కడి ఆడియన్స్ దృష్టిలో చరణ్ మంచి మార్కులే కొట్టేసినట్లు స్పష్టమవుతోంది.
స్టార్ ఇండియా గ్రూపు నిర్వహించిన సర్వే వివరాల్లోకి వెళితే....బాలీవుడ్ యంగ్ యాక్టర్ రణబీర్ కపూర్ ఈ సర్వేలో అత్యధిక ఓట్లు దక్కించుకుని మొదటి స్థానంలో నిలిచాడు. షాహిద్ కపూర్ రెండో స్థానంలో నిలవగా, రణవీర్ సింగ్ మూడో స్థానం అందిపుచ్చుకున్నాడు. ఆ తర్వాతి స్థానంలో వరుణ్ ధావన్, ఐదో స్థానంలో రామ్ చరణ్‌కు చోటు దక్కింది.
రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే....రామ్ చరణ్ ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈచిత్రంలో కాజల్ హీరోయిన్ ఇటీవల కన్యాకుమారిలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా పొల్లచ్చిలో షూటింగ్ జరుపుకుంటోంది.


Click it and Unblock the Notifications












