twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్సువల్ వేధింపులు సగం ఇళ్లలో ఉన్నాయి: రాధికా ఆప్టే

    తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఈ మాట దాదాపు గత సంవత్సర కాలంగా తరచూ వినిపిస్తూనే ఉంది. ఇదివరలో ఎప్పుడూ మాట్లాడని హీరోయిన్లు ఒక్కొక్కరే నోరు విప్పుతున్నారు.

    |

    Recommended Video

    సెక్సువల్ వేధింపులే ఎక్కువ ! -రాధికా ఆప్టే

    తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఈ మాట దాదాపు గత సంవత్సర కాలంగా తరచూ వినిపిస్తూనే ఉంది. ఇదివరలో ఎప్పుడూ మాట్లాడని హీరోయిన్లు ఒక్కొక్కరే నోరు విప్పుతున్నారు. సినీ పరిశ్రమలో ఈ చీకటి దందా గురించి ఇటీవ‌లి కాలంలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇక్కడ ఉన్న ఈ చీకటి కోణం మీద చాలామంది హీరోయిన్లే కొన్ని విషయాలని బయటపెట్టారు.

     ఒక హీరో డైరెక్టుగా కోరిక తీర్చమని అడిగాడు

    ఒక హీరో డైరెక్టుగా కోరిక తీర్చమని అడిగాడు

    నెమ్మదిగా ఆ గొడవ కాస్త చల్ల బడింది. గతంలో రక్త చరిత్ర, కబాలి, లెజండ్ చిత్రాల హీరోయిన్ రాధికా ఆప్టే కూడా తెలుగు చిత్ర సీమలో హీరోయిన్లని హీనంగా చూస్తారని, ఒక హీరో తనని డైరెక్టుగా కోరిక తీర్చమని అడిగాడని ఆమె ఆరోపించిన విషయం గుర్తుండే ఉండి ఉంటుంది.

     సెక్సువల్ హెరాస్మెంట్స్

    సెక్సువల్ హెరాస్మెంట్స్

    అదేంటో గానీ ఉన్నట్టుండీ రాధికా మళ్ళీ ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని మళ్ళీ తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్స్‌ను పరిశీలస్తే.. సెక్సువల్ హెరాస్మెంట్స్ అన్నీ గ్లామర్ వరల్డ్‌కే పరిమితం అని అంతా అనుకుంటున్నారని.. కానీ అనేక ప్రాంతాల్లో ఈ తరహా వేధింపులు ఉన్నాయని అంటోంది లెజెండ్ బ్యూటీ.

     ఇళ్లలో కూడా లైంగి వేధింపులు

    ఇళ్లలో కూడా లైంగి వేధింపులు

    'సగానికి సగం ఇళ్లలో కూడా లైంగి వేధింపులు ఉంటున్నాయి. కేవలం సినిమా రంగంలోనే అనుకోవడం సరికాదు. పిల్లలపై వేధింపులు.. గృహ హింస అనేవి ప్రపంచవ్యాప్తంగానే కాదు.. ఇండియాలో కూడా ఉన్నాయి. ప్రతీ రంగంలోను.. ఆఖరికి ఇంట్లోనే ఉండే వ్యక్తులు కూడా ఈ వేధింపులకు గురి కావాల్సి వస్తోంది.

     మహిళలు మాత్రమే కాదు

    మహిళలు మాత్రమే కాదు

    ఎంతో కొంత వేధింపులను సగానికి సగం మంది వ్యక్తులు ఫేస్ చేయాల్సి వస్తోంది. వీటిని అరికట్టేందుకు కృషి చేయాలి. మహిళలు మాత్రమే కాదు.. పురుషులు కూడా వీటి బారిన పడాల్సి వస్తోంది' అంటోంది రాధికా ఆప్టే. 'మనకు మనమే నో చెప్పడం ద్వారా వీటి నుంచి బయటపడచ్చని అనుకుంటున్నాను.

     ఎంత పెద్దదైనా సరే

    ఎంత పెద్దదైనా సరే

    మన లక్ష్యం ఎంత పెద్దదైనా సరే.. ఇలా నో చెప్పడం ద్వారా వాటిని అందుకోవడం కష్టం అవుతుందని భావించినా.. చెప్పాల్సిందే. మన సొంత ట్యాలెంట్ నే నమ్ముకోవాలి. ఒకరు చెబితే ఎవరూ వినకపోవచ్చు. కానీ 10 మంది చెప్పినపుడు అందరూ వింటారు కదా' అంటూ తన అభిప్రాయాన్ని రాధికా అప్టే నిక్కచ్చిగా చెప్పేసింది.

    English summary
    Actress Radhika Apte feels that sexual abuse does not only exist in the world of showbiz but takes place in every alternate household. "Sexual abuse takes place in every alternate household.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X